https://oktelugu.com/

Health Benefits: కండరాలు సమస్యలకు గుడ్‌బై చెప్పాలంటే.. ఈ మిల్క్ రోజూ తాగాల్సిందే!

సోయా మిల్క్ తాగడం వల్ల శరీరానికి బలం ఏర్పడుతుంది. ఎలాంటి పోషకాహార లోపం రాదు. కొందరికి పాలు నచ్చవు. అలాంటి వారు ఈ సోయా మిల్క్ తాగితే ఆరోగ్యంగా ఉంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2024 / 03:56 AM IST

    soy milk

    Follow us on

    Health Benefits: ఆరోగ్యంగా, బలంగా ఉండాలని చాలా మంది పాలు తాగుతుంటారు. పాలలోని కాల్షియం, పొటాషియం, మినరల్స్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువగా పాలు ఇస్తుంటారు. అయితే ఈ పాలు స్వచ్ఛమైనవి కాకపోవడం వల్ల కొందరు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పూర్వం రోజుల్లో ఆవులను పెంచుకునేవారు. కానీ ప్రస్తుతం ప్యాకెట్ పాల మీద ఆధారపడుతున్నారు. ఈ పాలను కల్తీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. తెలియక వీటిని పిల్లలకు పెట్టడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి రసాయనాలతో తయారు చేసిన పాల కంటే పిల్లలకు సోయా మిల్క్‌ను ఇవ్వడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ పాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కండరాలను కూడా బలంగా ఉంచుతుంది. ఈ సోయా మిల్క్ తాగడం వల్ల శరీరానికి బలం ఏర్పడుతుంది. ఎలాంటి పోషకాహార లోపం రాదు. కొందరికి పాలు నచ్చవు. అలాంటి వారు ఈ సోయా మిల్క్ తాగితే ఆరోగ్యంగా ఉంటారు.

    సోయా మిల్క్‌‌ను సోయాబీన్ గింజలతో చేస్తారు. ఇందులో ఎముకలు, కండరాలకు అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కూడా బయటకు పంపించడంలో బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోయా మిల్క్‌లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల వ్యాధులు రాకుండా కాపాడతాయి. డైలీ సోయా మిల్క్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ సోయా మిల్క్ మొక్కల ఆధారిత పాలు. వీటిని డైలీ తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. స్కిన్ కాంతివంతంగా మెరుస్తుంది. అయితే ఈ సోయా మిల్క్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. వీటిలో కల్తీ జరిగిందని భావిస్తే ఇంట్లోనే ఈ మిల్క్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన మిల్క్ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

     

    సోయా మిల్క్‌ను సోయాబీన్ గింజలతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు సోయాబీన్ గింజలు తీసుకుని దానికి నాలుగు కప్పులు నీటిని తీసుకోవాలి. వీటిని ఒక రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత రోజు వీటిని కాస్తా ఉడికించాలి. బాగా మెత్తగా అయిన తర్వాత వాటిని చల్లని నీటిలో వేస్తే వాటి తొక్కలు ఆటోమెటిక్‌గా వస్తాయి. ఆ తొక్కలు తీయకపోయిన పర్లేదు. తొక్కలు తీసిన వాటిని మళ్లీ బాగా ఉడికించాలి. ఇలా ఉడికిస్తే సోయా మిల్క్ తయారవుతుంది. దీన్ని వడబోసి పాలను వేరు చేసుకోవాలి. అంతే ఇక సోయా మిల్క్ రెడీ అయినట్లే. ఇలా ఇంట్లో సహజంగా తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఈ పాలు తాగడం వల్ల బలంగా ఉంటారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.