LIC Jeevan Labh: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన దేశంలో నివశించే ప్రజలకు వేర్వేరు పాలసీలను అందిస్తోంది. రిస్క్ లేని సురక్షితమైన పాలసీలను ఎల్.ఐ.సీ అందిస్తుండగా ఈ పాలసీలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ తమ పాలసీలలో డబ్బులను ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఆర్థిక భద్రతను అందిస్తోంది.
పాలసీలో డబ్బును సరైన విధంగా చెల్లించడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎల్‌ఐసీ పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ ఒకటి కాగా రోజుకు 262 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఏకంగా 20 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాలసీదారుడు మరణిస్తే నామినీ ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు.
Also Read: అలీ, పోసానీలకు జగన్ న్యాయం చేస్తున్నాడా? అన్యాయమా?
ఈ పాలసీని తీసుకోవడం వల్ల డెత్ బెనిఫిట్, పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కు కనీస బీమా మొత్తం 2 లక్షల రూపాయలు కాగా గరిష్టంగా ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. బీమా పరిమితిని పెంచితే నెలవారీ ప్రీమియం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 16, 21, 25 ఏళ్లకు ఈ పాలసీని తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: సంగీత ప్రపంచంలో డిస్కో గోల్డ్ మాన్
8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీకి ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. నెలవారీ చెల్లింపుల విషయంలో 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
Also Read:
1. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
2. తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
3. నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు
4. సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించాడా? ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో వాళ్లు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?