TPCC Revanth Reddy House Arrest: కేసీఆర్ మాటల ఎఫెక్ట్ కు కాంగ్రెస్ పోరుబాట పట్టింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సర్కార్ పై ఫైట్ కు దిగారు. ఇటీవల కేసీఆర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్ రెడ్డి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి రేవంత్ ను గృహ నిర్బంధం చేశారు.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
ఇక రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నాలకు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయనను అష్టదిగ్బంధనం చేసింది. ఆయన ఇంటిని పోలీసులు ముట్టడించారు. జూబ్లీహిల్స్ లోని నివాసం వద్ద పెద్దఎత్తున పోలీసులు చేరుకొని ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయనను హస్ అరెస్ట్ చేశారు.
ఇక హైదరాబాద్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మధుయాష్కీ తదితరులు అడ్డుకున్నారు.
Also Read: సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించాడా? ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో వాళ్లు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?
కాంగ్రెస్ పోరుబాటపై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అడుగడుగునా నేతలను అడ్డుకొని అరెస్ట్ చేసింది. రేవంత్ సహా కీలక నేతలను ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. పోలీసులతో రెండో కేటగిరి నేతలను అరెస్ట్ చేసింది. మొత్తంగా కాంగ్రెస్ కు మైలేజ్ రాకుండా చేసింది.