Rajat Patidar: గతంలో ఒకసారి ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ (ఆర్సీబీ) తరుపున ఆడిన ఆయన పెద్దగా రాణించలేదు. దీంతో ఈసారి ఐపీఎల్ వేలంలో అతడిని ఎవరూ పట్టించుకోలేదు. ఆయన వల్ల జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేదనుకున్నారు. కనీసం ఎక్స్ ట్రా ప్లేయర్ గా తీసుకోలేదు. జట్టులో చోటు రానందుకు తీవ్ర నిరాశ చెందిన ఆయనకు అనుకోకుండా అవకాశం వచ్చింది. దీనిని ఉపయోగించుకొని కసితో తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో శతకంతో చెలరేగిపోయి కష్టకాలంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంను ఆదుకున్నాడు. ఒకప్పుడు ఆయనను పట్టించుకోనివారంతా ఇప్పుడు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయనే రజత్ పటీదార్.

ఐపీఎల్ 2022 ఎలిమినేట్ మ్యాచ్ లో ఆర్సీబీ 208 భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిందంటే అది పటీదార్ వల్లే. బెస్ట్ ప్లేయర్స్ గా ఉన్న కోహ్లి 25, గ్లేన్ మ్యాక్స్ వెల్ 9, ఫాఫ్ డుప్లెసిస్ సున్నా పరుగులకే విఫలమయ్యారు. దీంతో ఈ మ్యాచ్ చేజారిపోయిందని అనుకున్నారు. కానీ ఇదే సమయంలో రజత్ పటీదార్ జట్టుకు ఊపిరిగా నిలిచాడు. 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్ లతో మొత్తం 112 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో రజత్ పటీదార్ ప్రతిభపై అనేక ప్రశంసలు వస్తున్నాయి.
Also Read: Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు ఇక లేనట్టేనా..అభిమానులకు ఇది ఊహించని షాక్
ఈ మ్యాచ్ తో పటీదార్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. 15 ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆప్స్ లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన అటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న వృద్ధిమాన్ సహా రికార్డును సమం చేశాడు. వృద్ధిమాన్ 49 బంతుల్లో సెంచరీ సాధించగా.. రజత్ పాటీదార్ కూడా 49 బంతుల్లోనే శతకం చేశాడు. ఐపీఎల్ లో సెంచరీ సాధించిన నాలుగో అన్ క్యాప్ డ్ ప్లేయర్ గా నిలిచాడు.

అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పటీదార్ ను వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. వేలం నిర్వహించిన సమయంలో రూ.20 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్నా.. ఏ ప్రాంచైసీ కొనుగోలు చేయలేదు. గత సీజన్ లో ఆర్సీబీ తరుపున ఆడిన ఆయన పెద్దగా రాణించలేదు. దీంతో ఈసారి అతన్ని పట్టించుకోలేదు. కనీసం ఎక్సట్రా ప్లేయర్ గా కూడా తీసుకోలేదు. కానీ ఆర్సీబీ జట్టులోని యువ ప్లేయర్ లువ్ నీత్ సిసోడియా గాయపడడంతో అతనిని రీప్లేస్ మెంట్ గా తీసుకుంది. అయితే ఆరంభ మ్యాచ్ లో అనూజ్ రావత్ కు అవకాశం ఇవ్వడంతో అతడు విఫలమయ్యాడు.
ఆ తరువాత కోహ్లీని ఓపెనర్ గా ప్రమోట్ చేసి ఫస్ట్ డౌన్లో రజత్ పటీదార్ ను దించింది. ఈ అవకాశాన్ని పటీదార్ ఉపయోగించుకున్నాడు. నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్ తో తొలిసారి హాప్ సెంచరీ చేసిన పటీదార్.. సన్ రైజర్స్ పై 48 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడి 275 పరుగులు చేశాడు. వద్దనుకున్న ప్లేయర్ ఇప్పుడు ఆర్సీబీని సెమీస్ చేసి అందరి దృష్టిలో పడ్డాడు.
Also Read:Mahesh Babu-Taraka Ratna: మహేష్ కి బావగా నందమూరి హీరో.. క్రేజీ కాంబినేషన్ !


