https://oktelugu.com/

Gopichand Pakka Commercial: “పక్కా కమర్షియల్” నుంచి పక్కా అప్ డేట్ వచ్చింది

Gopichand Pakka Commercial: హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి. కాగా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తమ కలయికలో వస్తున్న “పక్కా కమర్షియల్ ” సినిమా పై మొత్తానికి ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. కాగా ఈ సినిమా జులై 1వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ రోజు, సినిమా రెండో పాట ‘అందాల రాశి’ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 26, 2022 / 03:06 PM IST
    Follow us on

    Gopichand Pakka Commercial: హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి. కాగా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తమ కలయికలో వస్తున్న “పక్కా కమర్షియల్ ” సినిమా పై మొత్తానికి ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. కాగా ఈ సినిమా జులై 1వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ రోజు, సినిమా రెండో పాట ‘అందాల రాశి’ జూన్ 1, 2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    Gopichand

    ఇక గోపిచంద్ సరసన హీరోయిన్ గా రాశీఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా కోసమే మారుతి ‘పక్కా కమర్షియల్’ గా స్క్రిప్ట్ రాశాడట. మారుతి నుండి మాత్రం మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు,

    Also Read: Shruti Haasan: చాలా మందితో డేటింగ్ చేశాను… అతను మాత్రం చాలా రేర్‌

    ఇప్పటికే మారుతి ఈ సినిమా విషయంలో వినోదం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చాడు. అయినా అల్లు అరవింద్ కంపెనీ నుండి సినిమా వస్తుందంటే చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ సారి గోపీచంద్ కి మంచి విజయం దక్కుతుందని అనుకోవచ్చు. కాకపోతే, హీరో గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయాడు.

    Gopichand

    గోపీచంద్ హీరోగా సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే, ఈ సినిమా మార్కెట్ పై డౌట్ గా ఉన్నారు మేకర్స్. పైగా ఈ సినిమాతో పాటు మిగిలిన పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో గోపీచంద్ నిలబడగలడా ? చూడాలి. ఈ చిత్రానికి ఎస్.కె.ఎన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేష్‌, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    Also Read:Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు ఇక లేనట్టేనా..అభిమానులకు ఇది ఊహించని షాక్
    Recommended videos


    Tags