Shruti Haasan: ‘శృతి హాసన్’ చాలా బోల్డ్. ఐటమ్ సాంగ్స్ చేసే భామలు కూడా ‘శృతి’ రేంజ్ లో బోల్డ్ గా ఉండలేరు. ‘శృతి హాసన్’ అంత బోల్డ్ గా ఉంటుంది. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో పబ్లిక్ గా తిరుగుతూ.. ఆ మధ్య ఒకసారి అతని పెదవులను ముద్దాడుతూ ఫోజులు ఇచ్చింది. పైగా “నేను అతనితో లివిన్ రిలేషన్ షిప్ లో ఉంటాను…కానీ ఎప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోను’ అంటూ పబ్లిక్ గా చెప్పింది. ఇలా చెప్పగలడం బహుశా ఒక్క ‘శృతి హాసన్’కే చెల్లింది. తాజాగా మరో ఘాటు వ్యాఖ్యలు చేసింది.

మొదటి నుంచి శృతి హాసన్ కి పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదు. శృతి వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. మరో రెండేళ్లు దాటితే.. ఆంటీ వయసుకి వచ్చేసినట్లే. అయినా ఎందుకో ఇప్పటికీ ‘శృతి హాసన్’కి మాత్రం పెళ్లి ఆలోచన లేదు. పైగా తన బాయ్ ఫ్రెండ్స్ వివరాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ముందుకు పోతుంది.
Also Read: Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు ఇక లేనట్టేనా..అభిమానులకు ఇది ఊహించని షాక్
తాజాగా తన జీవితంలోని అఫైర్లు గురించి శృతిహాసన్ స్వేచ్ఛగా ఓపెన్ అయ్యిపోయింది. ప్రస్తుతం నేను శాంతను హజారికాతో డేటింగ్ లో ఉన్నాను. తను నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. మా మధ్య సినిమా, మ్యూజిక్, కళలు కామన్ విషయాలు. అందుకే మేమిద్దరం బాగా కనెక్ట్ అయ్యాం. శాంతను లాంటి వాళ్లు చాలా రేర్‌గా ఉంటారు. మీకు తెలుసు. నేను గతంలో చాలా మంది యాక్టర్లతో చాలా రోజులు పాటు డేటింగ్ చేశాను. కానీ నాకు ఏ మాత్రం వాళ్లతో వర్కౌట్ కాలేదు.

అయితే శాంతను తో మాత్రం నాకు చాలా బాగా సెట్ అయ్యింది. మా బంధంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది అంటూ ‘శృతి హాసన్’ చెప్పుకొచ్చింది. ఇంతకీ ‘శృతి హాసన్’ డేటింగ్ లిస్ట్ తెలుసా ? చాలా పెద్దది. ఆమె గతంలో సిద్ధార్థ్, నాగ చైతన్య, మైకేల్ కొర్సాల్ ఇలా పలువురితో ఫుల్ డేటింగ్ చేసి..వారితో ఫారిన్ ట్రిప్ లకు వెళ్లి ఎన్నో మధురానుభూతులను సంపాదించింది.
కానీ, పెళ్లి అనేది తనకు సెట్ అవ్వదు అంటుంది. అదేంటి ? బాయ్ ఫ్రెండ్లు సెట్ అయినప్పుడు పెళ్లి ఎందుకు సెట్ కాదు ? ఈ విషయాలు ఏమి తనను అడగొద్దు అంటుంది. అసలు ఏదీ ఎప్పుడూ దాచుకోకుండా బయటకు చెప్పేసే ‘శృతి హాసన్’కి ఎవరు మాత్రం ఏమి చెప్పగలరు ? ఒక్కటి మాత్రం స్పష్టం. పెళ్లి ప్రస్తావన తెస్తే ‘శృతి హాసన్’ కస్సుమని కోపం తెచ్చుకుని తెగ సీరియస్ అయిపోతుంది.
Also Read:Mahesh Babu-Taraka Ratna: మహేష్ కి బావగా నందమూరి హీరో.. క్రేజీ కాంబినేషన్ !
Recommended videos



[…] Also Read: Shruti Haasan: చాలా మందితో డేటింగ్ చేశాను… అతన… […]
[…] Read:Shruti Haasan: చాలా మందితో డేటింగ్ చేశాను… అతన… Recommended […]
[…] Read:Shruti Haasan: చాలా మందితో డేటింగ్ చేశాను… అతన… Recommended […]
[…] Also Read: Shruti Haasan: చాలా మందితో డేటింగ్ చేశాను… అతన… […]