India Corona Update: భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో జనం భయపడిపోతున్నారు. కాగా, తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,51,209 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ విడుదల చేసింది. ముందు రోజు నమోదైన కేసులతో పోలిస్తే కేసుల సంఖ్య బాగా తగ్గింది. వారం రోజుల నాటి పాజిటివిటీ రేటు 17.47 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ బారిన పడి 627 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 21,05,611 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

కరోనా కేసుల ఇలా రోజురోజుకూ తగ్గుముఖం పడితే మళ్లీ మునుపటి పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, కొవిడ్ కేసులు తగ్గినప్పటికీ మళ్లీ కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆఫ్రికాలోని గబ్బిలాల్లో ‘నియోకోవ్’ అనే వైరస్ ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. దాంతో అది మ్యుటేట్ అయి మన దేశం వరకు వస్తే మళ్లీ విపత్కర పరిస్థితులు పొంచినట్లే అని పలువురు అంటున్నారు. ఈ వైరస్ బారిన పడితే ప్రతీ ముగ్గురిలో ఒకరు కంపల్సరీగా మరణిస్తారని నిపుణులు చెప్తున్నారు.
Also Read: India Corona Cases: కరోనా ముప్పు తొలగేలా లేదా? కేసులు తగ్గినా.. మరణాలు పెరిగాయి
ఈ సంగతులు అలా ఉంచితే.. మన దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం కంపల్సరీ అనే నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు వీకెండ్ లాక్ డౌన్స్ పెట్టాయి. అవసరాన్ని బట్టి నిబంధనలు ఇంకా కఠినతరం చేస్తున్నాయి.
ఇకపోతే దేశవ్యాప్తంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 164.44 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మన దేశంలో జనవరి రెండు, మూడు వారాల్లో భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉందని, అయితే, నాలుగో వారం ప్రారంభం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ బాధితులే ఉన్నారని ఆరోగ్య నిపుణులు, ఐసీఎంఆర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: Telangana Corona Cases: తెలంగాణలో మొదలైన కరోనా కల్లోలం..రోజుకు ఎన్ని కేసులంటే?
[…] […]
[…] […]