Rashmi Gautam: తన అందచందాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.. తనకు అందమైన శరీరమే కాదు, అందమైన మనసు కూడా ఉందని మరోసారి ఘనంగా చాటుకుంది. ముఖ్యంగా రష్మీకి మూగజీవాలంటే ఎనలేని ప్రేమ. ఎవరైనా వాటిని హింసిస్తే వెంటనే రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. తాజాగా ఢిల్లీ జూలో ఓ ఉద్యోగి జంతువును అకారణంగా కొడుతున్న వీడియో ఆమె కంటపడింది.

వెంటనే దీనిపై సీరియస్ అయింది రష్మీ . ‘షేమ్ ఆన్ యూ ఢిల్లీ జూ స్టాఫ్’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది. అలాగే ‘జూకి ఎవరూ వెళ్లకండి. అక్కడ వాటిని ఎంతలా హింసిస్తున్నారో చూడండి. ఈ వీడియో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చేరేలా ట్యాగ్ చేయండి’ అని కోరింది. మొత్తానికి ఆ వీడియో పై యాంకర్ రష్మీ సీరియస్ అవుతూ సీఎంకు ఫిర్యాదు చేయడంతో ఆమె మళ్ళీ వార్తల్లో నిలిచింది.
Also Read: ‘గుడ్ లక్ సఖి’ రివ్యూ
మొత్తమ్మీద తాను మహా జంతు ప్రేమికురాలిని అని, ఈ విషయం తన అభిమానులందరికీ తెలుసు అని అంటోంది. ఎక్కడైనా ఏ పెట్ కైనా సాయం కావాలంటే తానూ వెంటనే రియాక్ట్ అవుతానని రష్మీ ఓ రేంజ్ లో చెప్పుకొస్తోంది. రీల్ లైఫ్ లో ఫుల్ గా గ్లామర్ ను వండి వార్చే రష్మీ గౌతమ్.. ఇలా రియల్ లైఫ్ లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందట. ఆమె జీవించే విధానం పూర్తిగా వేరు అట. ఎప్పుడూ ఇళ్లు, అమ్మ, తన పెంపుడు జంతువులే తన లోకంగా రష్మీ గౌతమ్ బతుకుతుందట.

టీవీ కార్యక్రమాలలో రష్మి గౌతమ్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే ఆమె సినిమా కెరీర్ ప్రస్తుతం డల్ పేజ్ లో ఉంది. టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రం తనకు చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవని, తానూ మూవీస్ లో బిజీ కావాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నానని అయినా ఛాన్స్ లు రావడం లేదు అని ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకుని బాధ పడింది.
ఏది ఏమైనా వెండితెరైనా బుల్లితెరైనా ఒళ్ళు దాచుకోకుండా తన గ్లామర్ ను ప్రదర్శన చేస్తోన్నా సినిమా డైరెక్టర్స్ మాత్రం తనకు పెద్దగా అవకాశాలు ఇవ్వట్లేదు అని, అందుకే ఇక సినిమాల గురించి పెద్దగా ఆలోచించను అని రష్మీ చెప్పుకొచ్చింది. అన్నట్టు రష్మికకు సీక్రెట్ గా పెళ్లి అయిపోయిందని, గత కొన్ని రోజులుగా ఆమె పై అనేక పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే, ఆ పుకార్ల పై రష్మీ మాత్రం ఇంతవరకు రియాక్ట్ కాలేదు.
Also Read: ఆస్తుల లెక్క: బీజేపీ టాప్.. కాంగ్రెస్ ఘోరం.. ప్రాంతీయపార్టీల్లో టీఆర్ఎస్ నంబర్ 2.. అప్పుల్లో టీడీపీ