Nidhi Agarwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. స్టార్ హీరోలు, కొత్త హీరోలు అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలను ఈ భామ సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో టాలీవుడ్లో భారీ విజయం అందుకున్న ఈ భామ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది.

నిధి అగర్వాల్ కు తెలుగులోనే కాకుండా తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఈ భామకు ఏకంగా అభిమానులు గుడిని కట్టారు. కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో సినిమాల్లో నటించిన నిధి అగర్వాల్ ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ‘అఖిల్’ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’లో నటించింది. ఆ తర్వాత నాగచైతన్యతో ‘సవ్యసాచి’లో నటించింది.
ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో పూరి జగన్మాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిధి అగర్వాల్ కు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘హీరో’ మూవీలో నిధి నటించింది. ఈ మూవీ రీసెంట్ గా రిలీజైంది.
ఈ సినిమాకు ముందు 50 నుంచి 80లక్షల పారితోషికం తీసుకునే నిధి అగర్వాల్ ‘హీరో’ కోసం ఏకంగా రెండు కోట్ల తీసుకుందని టాక్. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’లోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీ కోసం కోటికిపైగానే పారితోషికం అందుకుంటుందట. ఈ మూవీ హిట్ అయితే ఈ భామ మరింత రెమ్యూనరేష్ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ భామ తమిళంలో శింబుతో ప్రేమయాణం నడిపిస్తుందనే గాసిప్స్ విన్పిస్తున్నాయి.
[…] UP Election 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయాల్లో నాటకీయ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. యూపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. […]
[…] Virat Kohli: టీం ఇండియాలో ఎంఎస్ ధోని తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీకి పేరుంది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా టెస్టు సిరీస్‌ను అందించిన ఖ్యాతి అతని సొంతం. విదేశాల్లో జట్టుకు ఎక్కువ విజయాలు రుచి చూపించిన రథసారధి. దూకుడుగా ఆడటంతో పాటు జట్టును ముందుండి నడిపించడంలోనూ దూకుడుగా వ్యవహరించాడం విరాట్‌కు మాత్రమే సొంతం. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్సీగా తప్పుకున్న విరాట్.. బీసీసీఐతో చెలరేగిన వివాదం వలన తాజాగా టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశాడు. కోహ్లీ నిర్ణయం అటు క్రికెట్ అభిమానులతో పాటు బీసీసీఐను కూడా షాక్‌కు గురి చేసింది. […]
[…] […]