Kuja Dosha Nivarana: సాధారణంగా ప్రతి ఇంటిలో కిచెన్ ను మహిళలు నచ్చినట్లుగా సర్దుకుంటారన్న సంగతి తెలిసిందే. మామూలుగా వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాస్త అందంగా సర్దుకోవడం కూడా అవసరమే.. ఇందుకోసం కిచెన్ లో ఉన్న వస్తువులను సర్దుకోవాలి. అయితే వంటగదిలో ప్రత్యేక మార్పులు చేయడం వలన కుజుడి అనుగ్రహం పొందుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
కుజుడికి మంగళవారం ప్రీతికరమని చెబుతుంటారు. గ్రహాల్లో కుజుడు గ్రహం ప్రత్యేకమైనది. దీనినే మార్స్, అంగారక గ్రహం, అరుణ గ్రహం లేదా మంగళగ్రహ అని అంటుంటారు. ఈ ఎరుపు గ్రహానికీ వంటగదికి ప్రత్యేకమైన సంబంధం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వంటగది ఉండే దాన్ని బట్టి మనపై కుజ గ్రహ ప్రభావం అనుకూలంగా ఉందా? లేదా వ్యతిరేకంగా ఉందా? అనే తెలుస్తుందని వెల్లడిస్తున్నారు.
ఈ క్రమంలోనే కుజుడి అనుగ్రహం పొందాలంటే మంగళవారం రోజున వంటగదిలో కొన్ని మార్పులు చేయాలట. మొదటిగా చీపురును వంట గదిలో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇల్లును శుభ్రం చేయడానికి వినియోగించే చీపురులో చాలా బ్యాక్టీరియా, వైరస్ లు ఉండే అవకాశం ఉంది. దీన్ని కిచెన్ లో పెట్టడం వలన ఆ వైరస్, బ్యాక్టీరియా గది అంతటా వ్యాపించే ఛాన్స్ ఉంటుంది.
అలాగే వంటగదిలో అద్దం కూడా ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అద్దంలో పడే మంట రిఫ్లెక్ట్ అవుతుందని, దీని కారణంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా చిల్లుల పాత్రలు, చొట్టలు పడ్డ పాత్రలు, పాడైన గిన్నెలు వంటివి కిచెన్ లో ఉంచకూడదట. అటువంటి గిన్నెలు, పాత్రలను వాడకుండా ఉంచడంతో దుమ్ము, ధూళి పడి నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుందని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు.
అలాగే ఆహార పదార్థాలను కిచెన్ లో నిల్వ ఉంచకూడదని చెబుతున్నారు. ఈ విధంగా ఆహారాన్ని నిల్వ చేయడం వలన అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందని, దీని కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా కిచెన్ లో ఉప్పు, బియ్యం, గోధుమపిండి, నూనె, పసుపు తప్పనిసరిగా ఉండాలని, అవి ఎప్పుడూ అయిపోకూడదని చెబుతున్నారు.
ఈ నియమాలన్నీ పాటించడం వలన కుజుడి అనుగ్రహం పొందడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.