Star director Krish: స్టార్ డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్ పార్టీలో ఆయన కూడా పాల్గొన్నాడని సమాచారం. క్రిష్ (Krish) పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారట. రాడిసన్ హోటల్ లో డ్రగ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు చిత్ర ప్రముఖులు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. బీజేపీ నేత కుమారుడైన వివేకానంద ఈ పార్టీ ఏర్పాటు చేశాడు.
డ్రగ్ పార్టీ కేసులో పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. అయితే కొందరి పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. యూట్యూబ్ హీరోయిన్ లిషి గణేష్ పార్టీకి హాజరు కాగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారట. అలాగే శ్వేత అనే మరో విఐపీ దొరికినట్లు తెలుస్తుంది. తాజాగా ఓ టాప్ సెలెబ్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు క్రిష్ సైతం ఈ డ్రగ్ పార్టీకి హాజరయ్యారట.
పోలీసులు దర్శకుడు క్రిష్ పేరు ఎఫ్ఐఆర్ లో 8వ నిందితుడిగా పొందుపరిచారట. క్రిష్ ని పోలీసులు విచారించినట్లు సమాచారం. స్నేహితుడు ఆహ్వానం మేరకు పార్టీకి వచ్చానని చెప్పిన క్రిష్, అనంతరం తన కారులో వెళ్లిపోయానని వెల్లడించారట. ఒక ప్రముఖ దర్శకుడి పేరు డ్రగ్ కేసులో వినిపించడం కలకలం రేపుతోంది. ఇక టాలీవుడ్ సెలెబ్స్ లో పలువురు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
పూరి జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజ్, రవితేజ, తనీష్, రకుల్, రానా, తరుణ్ తో పాటు పలువురు విచారణకు హాజరయ్యారు. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల నేపథ్యంలో హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎన్నికల అనంతరం హరి హర వీరమల్లు పట్టాలెక్కనుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది.