Kitchen Tips: ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఎక్కువగా రోటీ తింటారు. అన్నంతో పాటు రోటీని కూడా డైట్‌లో యాడ్ చేసుకుంటారు. రోటీలు డైలీ తినడం వల్ల స్ట్రాంగ్‌గా ఉంటారని భావించి డైట్‌లో అసలు రోటీని మిస్ చేయరు. అయితే సాధారణంగా అందరూ తాజాగా రోటీ పిండిని తయారు చేసుకుంటారు. కానీ మరికొందరు బిజీ లైఫ్ వల్ల రెండు నుంచి మూడు రోజులకు సరిపడే రోటీ పిండిని కలుపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల కావాల్సినప్పుడు చపాతీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని భావిస్తారు. చపాతీలు తినడం వల్ల ఎక్కువగా బరువు పెరగకుండా ఫిట్‌గా ఉంటారు. ఇవి శరీరంలో పెరిగే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. తినడానికి చపాతీలు ఈజీగానే ఉంటాయి. కానీ వీటిని చేయడానికే చాలా మందికి కష్టం. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా తింటారు. అయితే ఉదయం టిఫిన్, లంచ్, రాత్రి డిన్నర్‌లో ఒకటో రెండో చపాతీలను తినాలని అనుకునేవారు.. ప్రతీసారి పిండి కలపలేక ఎక్కువగా కలిపి స్టాక్ ఉంచుకుంటారు. ఫ్రిడ్జ్‌లో ఎంత జాగ్రత్తగా ఉంచిన కూడా పిండి నల్లగా మారుతుంది. రోటీ పిండి ఇలా నల్లగా మారకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
చపాతీ పిండిని కలిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ తర్వాతకి నల్లగా మారదు. పిండిని కలిపేటప్పుడు నీరుతో పాటు కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి నల్లగా మారకుండా తాజాగా ఉంటుంది. అయితే పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుుడు గాలి వెళ్లని డబ్బాలో పెట్టాలి. చపాతీ పిండిని కలిపిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు నూనె రాసి పెట్టాలి. ఆ తర్వాత గాలి వెళ్లని డబ్బాలో పెడితే మీరు రెండు రోజుల తర్వాత చపాతీ పిండిని తీసిన కూడా నల్లగా మారదు. చాలామంది చపాతీల పిండిని చల్లటి నీటితో కలుపుతారు. కానీ ఇలా కాకుండా వేడి నీటితో చపాతీ పిండి కలిపితే నల్లగా మారకుండా ఉండటంతో పాటు చపాతీలు కూడా మృదువుగా వస్తాయి. అయితే ఇలా ఫ్రిడ్జ్‌లో స్టాక్ ఉంచిన చపాతీ పిండితో చేసిన రోటీలు తినడం వల్ల ఎసిడిటీ, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. బయట పెడితే చపాతీ పాడవుతుందని నిల్వ ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. ఎప్పటికప్పుడూ తాజాగా చపాతీ పిండిని కలుపుకుని రోటీలు చేసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఎక్కువగా నిల్వ ఉంచిన చపాతీ పిండితో చేసిన రోటీలు తినడం వల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజలు నిల్వ ఉంచినప్పుడు లిస్టెరియా మోనోసైటోజెన్స్ బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతుంది. ఈ బ్యాక్టీరియా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పిండిని కలుపుకుని తాజాగా రోటీలు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు.