Devisree Prasad-Mahesh Babu : వేలాది మంది ప్రేక్షకుల ముందు మహేష్ బాబు ని ఘోరంగా అవమానించిన దేవిశ్రీ ప్రసాద్..మండిపడుతున్న ఫ్యాన్స్!

మహేష్ బాబు సినిమా నుండి ఒక్కటంటే ఒక్క పాట కూడా పాడలేదు. ఇది ఆయన అభిమానులకు తీవ్రమైన నిరాశకు గురి చేసింది. అయితే దీనిపై సోషల్ మీడియా లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మిగిలిన హీరోలకు ఇచ్చిన రేంజ్ లో మ్యూజిక్ మహేష్ బాబు కి ఇవ్వలేదని, జోష్ గా ఎంజాయ్ చేసే సాంగ్స్ వీళ్ళ కాంబినేషన్ లో రాలేదని, అందుకే దేవిశ్రీ ప్రసాద్ మహేష్ పాటలను పాడలేదంటూ దేవిశ్రీ ప్రసాద్ ని అభిమానించే వాళ్ళు చెప్పుకొచ్చారు

Written By: Vicky, Updated On : October 20, 2024 6:42 pm

Devisree Prasad-Mahesh Babu

Follow us on

Devisree Prasad-Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పై పీకల్లోతు కోపం లో ఉన్నారు. ఎంత కోపంలో అంటే ఆయన బయట కనిపిస్తే కొట్టేస్తారేమో, సోషల్ మీడియా లో అంత ఫైర్ తో ఊగిపోతున్నారు. అదేంటి మహేష్ బాబు తో ‘మహర్షి’, ‘శ్రీమంతుడు’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘1 నేనొక్కడినే’, ‘భరత్ అనే నేను’ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించాడు కదా, గుర్తించుకోదగ్గ పాటలను కూడా ఇచ్చాడే..!, అలాంటి దేవిశ్రీ ప్రసాద్ మీద అభిమానులు ఎందుకు ఇంత ఫైర్ అయ్యారు?, ఇంతకీ దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఆ అవమానం ఏమిటి అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము. నిన్న హైదరాబాద్ లో దేవిశ్రీ ప్రసాద్ ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ని భారీ రేంజ్ లో ప్లాన్ చేసాడు.

ఈ కన్సర్ట్ కి మెగాస్టార్ చిరంజీవి ని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించాడు కూడా. అయితే ఈ ఈవెంట్ లో దేవిశ్రీప్రసాద్ ఆయన టాలీవుడ్ లో పని చేసిన స్టార్ హీరోలందరికీ సంబంధించిన పాటలు పాడాడు కానీ, మహేష్ బాబు సినిమా నుండి ఒక్కటంటే ఒక్క పాట కూడా పాడలేదు. ఇది ఆయన అభిమానులకు తీవ్రమైన నిరాశకు గురి చేసింది. అయితే దీనిపై సోషల్ మీడియా లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మిగిలిన హీరోలకు ఇచ్చిన రేంజ్ లో మ్యూజిక్ మహేష్ బాబు కి ఇవ్వలేదని, జోష్ గా ఎంజాయ్ చేసే సాంగ్స్ వీళ్ళ కాంబినేషన్ లో రాలేదని, అందుకే దేవిశ్రీ ప్రసాద్ మహేష్ పాటలను పాడలేదంటూ దేవిశ్రీ ప్రసాద్ ని అభిమానించే వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ వీళ్ళ కాంబినేషన్ లో ‘మైండ్ బ్లాక్’, ‘హూ ఆర్ యూ’ వంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి. ఇవి ఒక లైవ్ కన్సర్ట్ లో పాడుతూ ఎంజాయ్ చేయదగ్గ పాటలే. కానీ అది జరగలేదు. చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే మహేష్ పాటలను పక్కకి నెట్టేసాడని అనిపిస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఏమైనా చెడిందా..?, అంత మంది హీరోల సినిమాలకు సంబంధించిన పాటలు లైవ్ లో పాడి, మహేష్ సినిమాల పాటలను మర్చిపోవడం ఏమిటి?, కేవలం పాటలనే కాదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లైవ్ ప్రదర్శన చేస్తున్నప్పుడు కూడా మహేష్ సినిమాలు దేవిశ్రీ కి గుర్తు రాలేదు.

వెనుక LED స్క్రీన్ లో సన్నివేశం ప్లే అవుతూ ఉంటే, అక్కడ మ్యూజిషియన్స్ లైవ్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాలి. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘మిర్చి’, అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను LED లో ప్రదర్శించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇచ్చారు. ఇలా రెండు సంఘటనల్లోనూ మహేష్ బాబు సినిమాలను పక్కకి నెట్టాడు దేవిశ్రీప్రసాద్. దీనికి ఆయన కచ్చితంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సమాధానం ఇవ్వాల్సిందే, మరి ఇస్తాడో లేదో చూద్దాం.