Children : పిల్లలు భలే ముద్దు వస్తుంటారు. పిల్లలను చూసి ముద్దు పెట్టుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. ప్రతి ఒక్కరు ముద్దు చేస్తుంటారు పిల్లలను. ఇక అప్పుడే పుట్టిన పిల్లలను చూస్తే మరింత క్యూట్ గా ఉంటారు. కానీ పిల్లలను ముద్దు పెట్టుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఇలా చేసే ముందు, ఒకటికి రెండుసార్లు కాదు, వందసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే జస్ట్ మీ ముద్దు వల్ల ఒక అమాయకపు పిల్లవాడు చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నిజమే దీనికి రుజువులు కూడా ఉన్నాయండోయ్. ఒక బంధువు, ప్రేమతో, 16 నెలల చిన్నారిని ముద్దు పెట్టుకున్నాడు. దాని ఫలితంగా కంటిలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఆ పిల్లవాడు కంటి చూపును కోల్పోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
Also Read : ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి.
నమీబియా నివాసి మిచెల్ సైమన్కు అకస్మాత్తుగా కంటి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది తన తోనే ఆగిపోలేదు. తన 16 నెలల కుమారుడు జువాన్కు కూడా ఇది సోకింది. మొదట్లో ఇది ఒక సాధారణ కంటి వ్యాధిలా అనుకున్నారు అంతా.. కానీ పరిస్థితి మరింత క్షీణించడంతో అది తీవ్రమైన సమస్య అని అర్థం అయింది. వైద్య పరీక్షల్లో తన కంటిలో హెర్పెస్ వైరస్ (జలుబు పుండు) ఇన్ఫెక్షన్ ఉందని, ఇది ముద్దు పెట్టుకోవడం వల్ల వచ్చిందని తేలిందట. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఆ బిడ్డ కన్ను కోల్పోయాడు. అది కూడా కేవలం ముద్దు పెట్టుకోవడం వల్ల సోకింది.
పిల్లల కార్నియాలో రంధ్రం
ఆ చిన్నారి తల్లి సైమన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో తన బాధను వ్యక్తం చేసింది కూడా. ‘ఆ చిన్నారి కంటిపై చాలా లోతైన గీత ఉంది. దీని వల్ల చికాకు పెరిగిందట. అతనికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదట. కొంత సమయం తర్వాత తను డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందట. ఇది యాక్టివ్ జలుబు పుండు వల్ల వస్తుంది. ఈ వైరస్ పిల్లల కంటి కార్నియాలో లోతైన రంధ్రం ఏర్పడేలా చేసింది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ కంటికి మొత్తం వ్యాపించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన వైద్యులు జువాన్ కంటిని కాపాడటానికి అతని కనురెప్పలకు కుట్లు వేశారు. పాపం పూర్తిగా కంటి చూపును కోల్పోయాడు.
పొరపాటున కూడా పిల్లలను ముద్దు పెట్టుకోకండి.
ముద్దుల వల్ల ఇంత పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని మామూస్ తల్లి చెప్పింది. అలాంటి తప్పులు చేయకుండా ఉండాలని అందరి తల్లిదండ్రులను కోరుతున్నారు. పిల్లవాడిని ముద్దుపెట్టుకునే ముందు ఆలోచించాలని సైమన్ అన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలను ముద్దు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. దీని వల్ల చాలా ఇన్ఫెక్షన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది.
Also Read : లక్షలు సంపాదిస్తున్న దంపతులు కూడా పిల్లలను వద్దు అనుకుంటున్నారా? దీనికి కారణం ఏంటి?