Tea and Coffee : టీ, కాఫీ లవర్స్ గురించి మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం లేవగానే ఓ కప్పు టీ పడితే అదో ఆనందం, ఉత్సాహం కదా. ఇక చలికాలంలో టీ తాగితే ఆ ఆనందం మరో లెవల్ లో ఉంటుంది. అయితే చలికాలంలో టీ అంటే ఒకే. మరి ఎండాకాలంలో టీ తాగవచ్చా లేదా? తాగితే ఏమైనా సమస్యలు వస్తాయా వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరుగుతుంది. అయితే, టీ, కాఫీని ఇష్టపడే వారు వేసవిలో కూడా దీనిని తాగుతుంటారు.
Also Read : టీ ఇలా తయారు చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..
PIB జారీ చేసిన సలహా:
దేశంలో పెరుగుతున్న వేడిని నివారించడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఇటీవల PIB దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తల గురించి చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం శీతల పానీయాలు, కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి పానీయాలు తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురి కావాల్సి వస్తుంది. ఈ వస్తువులను అధికంగా తీసుకోకుండా ఉండాలి. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్ ప్రమాదం ఎలాగూ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో టీ, కాఫీ తాగితే, ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.
సోపు-యాలకుల టీ
మీరు టీ ప్రియులైతే, టీలో అధిక కెఫిన్ ఉంటుంది కాబట్టి మీకు అజీర్ణం సమస్య వస్తుంది. అయినా సరే మీరు టీ తాగాలనుకుంటే, దానికి సోంపు, యాలకులు వంటి కొన్ని మసాలా దినుసులను యాడ్ చేసుకోండి. దీని సహజ లక్షణాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. కడుపు వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ టీ తాగకూడదు.
కాఫీ తాగవచ్చా?
కాఫీలో కెఫెన్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల శరీరంలో అదనపు ద్రవాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వేసవిలో నిర్జలీకరణ ప్రమాదం పెరుగుతుంది. టీ, కాఫీ రెండింటినీ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. వేసవి కాలంలో కాఫీని అధికంగా తీసుకోవడం మానుకోవాలి. మీరు కాఫీ తాగుతుంటే, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి రోజంతా పుష్కలంగా నీరు, జ్యూస్‌లు తాగాలి అని గుర్తు పెట్టుకోండి.
గ్రీన్ టీ తాగవచ్చా?
వేసవి మీ శరీరాన్ని వివిధ రకాలుగా అలసిపోయేలా చేస్తుంది. మీ జీర్ణవ్యవస్థకు సమస్యలను కూడా సృష్టిస్తుంది. టీ, కాఫీలకు బదులుగా, మీరు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు. ఇది కడుపును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, విషాన్ని తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించడంలో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.