Homeలైఫ్ స్టైల్King Cobra Venomous : కింగ్ కోబ్రా.. అంతటి విషపాము తన పిల్లల విషయంలో ఎలా...

King Cobra Venomous : కింగ్ కోబ్రా.. అంతటి విషపాము తన పిల్లల విషయంలో ఎలా ఉంటుందో తెలుసా?

King Cobra Venomous : ఈ వర్షాకాలంలో, కింగ్ కోబ్రాస్ పర్వతాల దట్టమైన అడవులలో తమ గుడ్లను కాపాడుకుంటాయి. ఆడ పాము పిల్లలు పుట్టే వరకు తన గూడు నుంచి కదలదు. చాలా రోజులు ఆకలితో ఉండాల్సి వచ్చినా కూడా అలాగే ఉంటుంది. అయితే, ఈ సమయంలో ఆహారం ఏర్పాటు చేసే బాధ్యతను మగ పాము తీసుకుంటుంది. గూళ్ళను పర్యవేక్షించడంతో పాటు, చుట్టుపక్కల గ్రామస్తులతో సమన్వయాన్ని కొనసాగించడం కూడా వాటి పని. తద్వారా అవి గూళ్ళను రక్షించడంలో సహాయపడతాయి. అందుకే పాముల భయంతో వాటిపై దాడి చేయవద్దు అంటున్నారు జంతు ప్రేమికులు.

దాదాపు 10 నుంచి 12 అడుగుల పొడవు ఉంటుంది ఈ కింగ్ కోబ్రా. ఇవి మాత్రమే గూడు కట్టుకుని గుడ్లు పెడుతుంది. అన్ని పాము జాతులలో, ఇది అత్యంత శక్తివంతమైనది. ఆహార చక్రంలో అగ్రస్థానంలో ఉంటుంది. అన్నింటికంటే, కింగ్ కోబ్రా ఎందుకు గూళ్ళు నిర్మిస్తుంది అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది? ఇంత తెలివితేటలు, ప్రేమ మరే ఇతర పాములోనూ కనిపించవట. గుడ్లు పెట్టడంతో పాటు వాటిని రక్షించడానికి, గుడ్లు పొదగడానికి అవసరమైన ఉష్ణోగ్రత, తేమను నిర్వహించడానికి అవి ఇలా చేస్తాయట. కొండచిలువ వంటి మరికొన్ని పాములు కూడా వాటి గుడ్లను కాపాడుకుంటాయి. కానీ కింగ్ కోబ్రా మాత్రమే గూడును నిర్మిస్తుంది అని నిపుణులు అంటున్నారు.

కింగ్ కోబ్రాస్ ఒకేసారి కనీసం 15 గుడ్లు పెడతాయి. 40 వరకు కూడా గుడ్లు పెడతాయి. గుడ్లు పొదగడానికి దాదాపు 70 నుంచి 100 రోజులు పడుతుంది. కింగ్ కోబ్రా వంటి పాములను సంరక్షించడానికి, ప్రజల్లో పాముల భయాన్ని తగ్గించి, వాటిని సంరక్షించమని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. మన దేశంలో పాములను పూజిస్తున్నప్పటికీ, భయం, సమాచారం లేకపోవడం వల్ల పాములను చంపుతారు. ప్రతి పాము విషపూరితమైనదని ప్రజలు భావిస్తారు. అయితే దాదాపు 80 శాతం పాములు విషపూరితమైనవి కావు.

Also Read : రెండు రోజులుగా శివాలయంలోనే నాగుపాము… దాన్ని బయటకు తీయడానికి పూజారి ఏం చేశాడంటే ?

హిమాలయ కింగ్ కోబ్రా రహస్యం
హిమాలయ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. కానీ కింగ్ కోబ్రాస్ నైనిటాల్, చుట్టుపక్కల మాత్రమే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. హిమాలయ కింగ్ కోబ్రాను అధ్యయనం చేస్తున్న వారు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. అయితే వాస్తవానికి, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా కింగ్ కోబ్రా వీక్షణలు నమోదయ్యాయి. ఇది ఉత్తరాఖండ్‌లోని అత్యంత ఎత్తులో కనిపించిందట. ఇంత చల్లని హిమాలయ వాతావరణంలో అవి ఎలా మనుగడ సాగిస్తాయో అని వారికి ఆశ్చర్యంగా అనిపించిదట.

కింగ్ కోబ్రాస్ అనేవి సాధారణంగా దేశంలోని దక్షిణ ప్రాంతాలలోని వర్షారణ్యాలలో కనిపించే పాములు. కానీ ఉత్తరాఖండ్‌లో, సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉన్న కార్బెట్ నేషనల్ పార్క్ నుంచి 2300 మీటర్ల ఎత్తులో ఉన్న ముక్తేశ్వర్ వరకు వాటి ఉనికిని నమోదు చేశారు. ఇక పశ్చిమ కనుమలలోని ఆరు రాష్ట్రాల్లో కనిపించే కింగ్ కోబ్రా కంటే హిమాలయన్ కింగ్ కోబ్రా భిన్నమైన జాతినా ? కర్ణాటకలోని సరీసృపాల జాతుల నిపుణుడు పి. గౌరీశంకర్ ఈ అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. కర్ణాటక నుంచి బర్మా, వియత్నాం, థాయిలాండ్, సుమత్రా, బాలి, ఫిలిప్పీన్స్ వరకు కింగ్ కోబ్రా ఉన్న ప్రాంతాలను ఆయన అధ్యయనం చేశారు.

ఉత్తరాఖండ్ అటవీ శాఖ 2015 నుంచి జూలై 2020 వరకు రాష్ట్రంలో కింగ్ కోబ్రా ఉనికిని కూడా అధ్యయనం చేసింది. వివిధ వనరుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా, 5 జిల్లాల్లో 135 కింగ్ కోబ్రా వీక్షణలు నివేదించారు. వీటిలో, కింగ్ కోబ్రా ఉనికిని నైనిటాల్‌లో అత్యధికంగా అంటే 86 సార్లు, డెహ్రాడూన్ 32 సార్లు, పౌరి 12 సార్లు, ఉత్తరకాశి 3 సార్లు, హరిద్వార్ 2 సార్లు నమోదు చేశారు.

ప్రమాదం
వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద షెడ్యూల్ 2లో కింగ్ కోబ్రా జాబితా చేశారు. ఇదొక హానికరమైన జాతిగా పరిగణించింది IUCN. పులులు, ఏనుగులు కూడా ఎదుర్కోలేని శక్తివంతమైన పాము ఉనికికి మనుషుల వల్ల ముప్పు వాటిల్లుతోంది. అడవులలో జల విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్లు, రైల్వేల నిర్మాణం వంటి అభివృద్ధి సంబంధిత కార్యకలాపాల కారణంగా వాటి సహజ ఆవాసాలు తగ్గిపోతున్నాయట.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular