Kia EV9: ఆటోమోబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)ల హవా నడుస్తోంది. చాలా కంపెనీలు ఈవీల ఉత్పత్తికే మొగ్గు చూపుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన అతిపెద్ద కార్ల కంపెనీ కియా ఇప్పటికే 2021లో ఈవీ6 ను విడుదల చేసి వినియోగదారులను ఆకర్షించింది. ఇది మూడు వరుసల సీట్లను కలిసిగి 99.8 కిలో వాట్ అవర్ బ్యాటరీతో నడిచింది. ఇప్పుడు కియా కంపెనీ నుంచి ఈవీ 9ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. దీనిని వరల్డ్ వైడ్ మార్కెట్లో జూన్ 19న రిలీజ్ అవుతున్న దీని వివరాలు తెలుసుకుందాం..
పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈవీలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఈవీలను బయటకు తీశాయి. అయితే కియా కంపెనీ ఈయూలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో ఈవీ9ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మోడల్ ధరను ప్రస్తుతం రూ.46.8 నుంచి 52.5 లక్షల వరకు నిర్ణయించారు. ముందుగా దీనిని కొరియాలో విడుదల చేసి.. ఆ తరువాత యూనైటేడ్ స్టేట్, యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు.
కియా ఈవీ 9న బెస్ట్ ఛార్జబుల్ వెహికిల్ అని అంటున్నారు. కేవలం 7 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే 80 శాతం పూర్తవుతుందని అంటున్నారు. ఇందులో 77.4K లిథియం -అయాన్ పాలిమర్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీంతో ఛార్జింగ్ విషయంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తోంది. ఇక ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 483 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. అయితే అంతకుముందు రిలీజ్ చేసి ఈవీ6 501 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చింది.
ఇక ఫీచర్స్ విషయానికొస్తే..గ్రిల్ పై పిక్సెల్ ఎల్ ఈడీ లైట్లు ఆకర్షిస్తాయి. ఈవీ 9 పూర్తిగా E-GMPపై ఆధారపడుతుంది. మిగతా పార్ట్స్ అన్నీ ఆటోమెటిక్ గా పనిచేస్తాయి. అంతర్జాతీయ విక్రయాల కోసం కియా లక్ష కార్లను ఉత్పత్తి చేస్తోంది. 2026 నాటికి 10 లక్షల విద్యుత్ కార్లను విక్రయించాలని టార్గెట్ పెట్టుకుంది. ఎస్ యూవీ లను ఇష్టపడేవారు సైతం ఈవీ9ను ఆదరిస్తారని కియా నమ్ముతోంది.