Gali Janardhan Reddy Son: ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల కొడుకులు కూడా ఇప్పుడు సినీ రంగం వైపు మళ్లుతున్నారు. తెలుగులో హీరో మహేష్ బాబు బావ, ప్రముఖ ఎంపీ, వ్యాపారవేత్త అయిన గల్లా జయదేవ్ కుమారుడు ఇటీవల ‘హీరో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తెలుగునాటే కాదు.. ఇప్పుడు కన్నడ నాట కూడా ఈ వారసత్వ హీరోయిజం కొనసాగుతోంది.

ప్రముఖ వ్యాపారవేత్త, కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు ‘కిరిటి’ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కబోతున్న సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు కిరిటీ అన్ని రకాల శిక్షణలు తీసుకున్నాడు.
వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నాడు. హైబడ్జెట్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీకి పాపులర్ టెక్నీషియన్లు పనిచేయనున్నారు.
రాధాకృష్ణ డైరెక్ట్ చేయబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలి సినిమాకు పనిచేసిన కే.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా సెట్ అయ్యారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఏకంగా బాహుబలికి పనిచేసిన దిగ్గజ టీంను భారీగా డబ్బులిచ్చి మరీ ‘గాలి’ కొడుకు కోసం సెట్ చేయబోతున్నట్టు సమాచారం.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ దృష్ట్యా పీటర్ హెయిన్స్ ను స్టంట్ డైరెక్టర్ గా తీసుకుంటున్నారట.. మార్చి 4న కిరిటీ లాంఛింగ్ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు త్వరలో తెలువనున్నాయి.
Recommended Video: