మనలో చాలామంది దేవుడిని నియమనిష్టలతో పూజిస్తారు. అయితే దేవుడిని పూజించే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఒకవేళ్ల ఏదైనా కారణాల వల్ల జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం పూజ వల్ల శుభ ఫలితాల కంటే అశుభ ఫలితాలే కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సరైన ఫలితాలు పొందాలని అనుకుంటే పూజ చేసే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పవచ్చు.
పూజ చేసే సమయంలో పంచ దేవుళ్లను తప్పనిసరిగా పూజించాలి. మహాదేవుడు, దుర్గాదేవి, విష్ణువు, గణేశుడు, సూర్య దేవ్ లను పంచ దేవుళ్లుగా పిలుస్తారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ దేవుళ్లను పూజిస్తే మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇంట్లో పూజ గది ఉంటే తప్పనిసరిగా సాయంత్రం సమయంలో దీపాలను వెలిగించాలి. ఎవరైతే దీపాలను వెలిగిస్తారో వాళ్లకు దేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది.
పూజ చేసే సమయంలో ఆసనాల భంగిమలలో పూజ చేస్తే మంచిది. నేలపై కూర్చుని పూజ చేయడం వల్ల కొన్నిసార్లు సరైన ఫలితాలను పొందడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే. ఆసనాలు వేయకుండా పూజ చేస్తే మంచి ఫలితాలను పొందడం సాధ్యం కాదు. పూజ చేసే సమయంలో ముఖం పడమర వైపుకు ఉంచి పూజ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఇతర దిక్కులకు ముఖం ఉంచి పూజ చేసినా మంచి ఫలితాలను పొందడం సాధ్యం కాదు.
ఇంట్లో పూజగది ఎల్లవేళలా ఈశాన్య గదిలో ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దిశలో కాకుండా ఇతర దిశలలో పూజ గది ఉంటే మంచి ఫలితాలు దక్కే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తరచూ పూజలు చేసేవాళ్లు ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటిస్తే మంచిదని చెప్పవచ్చు.