Ideal Sleep Duration: ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్ర కూడా అవసరమే. ఎలాంటి పౌష్టికాహారం తీసుకోకున్నా.. సరైన నిద్ర లేకపోతే అనారోగ్యానికి గురవుతారు. కానీ నేటి కాలంలో చాలామంది రకరకాల కారణాలతో అవసరమైన నిద్రపోవడం లేదు. దీంతో చిన్న వయసులోనే దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే కొంతమంది ఉదయం వివిధ కారణాలతో బిజీగా ఉన్నవారు సాయంత్రం మనసు ఆందోళనగా ఉండి నిద్రపోవడం లేదు. ఇలాంటి సమయంలో ఆరోగ్య సూత్రాలు పాటించి కొందరు నిద్ర గడియారం ప్రకారం నిద్రిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అవసరానికంటే ఎక్కువగా నిద్రిస్తున్నారు. నిద్ర లేకపోతే అనారోగ్యం పాలవుతారని మొన్నటి రీసెర్చ్.. కానీ అతిగా నిద్రపోతే కూడా ప్రమాదమేనని కొందరు తాజాగా వైద్యులు చెబుతున్నారు.. ఇంతకీ ఆ రీసెర్చ్ ఏంటంటే?
Also Read: మద్యం సేవించే వారికి అలర్ట్.. ఇవి గమనించకపోతే డేంజర్..
ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎనిమిది గంటల నిద్ర పోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ కొందరికి అనుకోకుండానే నిద్ర వస్తూ ఉంటుంది. ఇలాంటివారు కార్యాలయాల్లోనూ.. ఇంట్లోనూ.. సమయం దొరికినప్పుడు అలా నిద్రిస్తూ ఉంటారు. అయితే థైరాయిడ్ లాంటి సమస్య ఉన్నవారికి కూడా నిద్ర వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో టైం సెట్ చేసుకొని మాత్రమే నిద్రిస్తూ ఉండాలి. మిగతా సమయాల్లో ఏదైనా ధ్యానం వంటివి చేయాలి. సమయానికంటే ఎక్కువగా నిద్రపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తాజాగా వైద్యులు చెబుతున్నారు.
‘స్లీప్ హెల్త్ ఫౌండేషన్ ‘నివేదిక ప్రకారం మనిషి 9 గంటలు నిద్రపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా నిద్ర తక్కువ పోయే వారిలో కంటే ఎక్కువగా నిద్రించే వారిలోనే మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక తెలుస్తోంది. ఈ సంస్థ తెలిపిన ప్రకారం ఏడు గంటలు కంటే తక్కువ నిద్రపోయే వారిలో 14 శాతం మరణాలు ఉంటే.. 9 గంటలు నిద్రపోయే వారిలో మరణాల రేటు 34% ఉన్నట్లు వీరు గుర్తించారు. అంటే తక్కువ నిద్రపోయే వారి కంటే ఎక్కువగా నిద్ర పోయే వారిలోనే ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: తెల్లని గుడ్లు.. గోధుమ రంగు గుడ్లు.. వీటిలో ఏది బెటర్? ఏది తినాలి
అతిగా నిద్ర పోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని స్లీప్ హెల్త్ ఫౌండేషన్ తెలిపింది. అందువల్ల ఏడు నుంచి ఎనిమిది గంటల లోపు నిద్ర పోయే ప్రయత్నం చేయాలని ఈ సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు. అలా 8 గంటల లోపు నిద్రపోతే ఆరోగ్యంగా ఉండగలుగుతారని అంటున్నారు. నిద్ర తక్కువైనా పర్వాలేదు గానీ.. ఎక్కువగా నిద్రపోతే మాత్రం మానసికంగా ఆందోళనలతో ఉంటారని చెబుతున్నారు. కొందరు రైతులు చెబుతున్న ప్రకారం ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. కానీ అతిగా నిద్రపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సమయం దొరికినప్పుడల్లా కాకుండా.. నిద్ర గడియారాన్ని ఏర్పాటు చేసుకొని నిద్రిస్తూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.