Journey: సాధారణంగా ప్రయాణాలు అందరూ చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో డిఫరెంట్ డ్రస్‌లు ధరిస్తారు. ఒక్కోరికి ఒక్కో డ్రస్ కంఫర్ట్ ఉంటుంది. ముఖ్యంగా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు అయితే చాలా మంది షార్ట్స్ ధరిస్తారు. ఎందుకంటే ప్రయాణమే కదా.. ఇలాంటి డ్రస్ అయితే చాలా కంఫర్ట్‌గా ఉంటుందని భావిస్తారు. అయితే ఇలాంటి డ్రస్‌లు ఎక్కువగా ట్రైన్ లేదా బస్సులో ధరిస్తారు. ఎందుకంటే అక్కడ డ్రస్ పాడవుతుందని వేసుకుంటారు. అయితే విమాన ప్రయాణాలు అంటే కాస్త స్టైల్‌గా ఉండటానికి అందరూ ఇలా షార్ట్స్ ధరించరు. ఎవరో కొందరు మాత్రం ఫ్లైట్‌లో జర్నీ చేస్తుంటారు. అయితే విమానంలో ఇలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు షార్ట్స్‌తో చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విమానాల్లో ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుుడు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
లాంగ్ జర్నీ చేసేటప్పుడు అన్ని రకాల ప్రిపరేషన్లు ముందే చేసుకోవాలి. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో అయితే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎక్కువ సేపు కూర్చొని ట్రావెల్ చేయాల్సి వస్తే కంఫర్ట్‌గా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. అయితే ఎక్కువ శాతం మంది ప్యాంట్లకు బదులుగా షార్ట్స్ వేసుకుంటారు. ఫ్లైట్ జర్నీలో ఇలా షార్ట్స్ వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే దాదాపుగా 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తారు. దీనివల్ల విమానంలో ఉండే హానికర క్రిములు ఈజీగా మీ చర్మానికి అంటుకుంటాయి. సాధారణంగా విమానాల్లో చాలా మంది ప్రయాణిస్తారు. వారు ప్రతీసారి ఫ్లైట్‌ను క్లీన్ చేయరు. కాబట్టి షార్ట్స్ ఎక్కువగా ధరించకూడదని నిపుణులు అంటుంటారు. చర్మానికి గాలి తగలకుండా ఉన్న దుస్తులను ధరించాలి. ఇవి హానికర క్రిముల నుంచి రక్షిస్తాయి. విమానంలో ఉండే ప్రతీ ప్లేస్‌లో అనారోగ్యమై క్రిములు ఉంటాయి. మీరు వీటిని ఉపయోగించడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది.
కొందరు ఫ్లైట్ కదా శుభ్రంగా ఉంటుందని చేతులు పెడుతుంటారు. కనీసం శుభ్రం చేసుకోకుండా మళ్లీ ఫుడ్ తింటారు. ముఖ్యంగా టాయిలెట్‌లో అయితే టిష్యూ ఉపయోగించి మాత్రమే ఫ్లష్ చేయాలి. లేకపోతే వాటిపైన ఉండే బ్యాక్టీరియా అంతా మీకు అంటుకుంటుంది. అలాగే బాత్ రూమ్ వెళ్లిన ప్రతీసారి తప్పకుండా చేతులను శానిటైజ్ చేసుకోవాలి. విమానాల్లో ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే భూమికి చాలా ఎత్తులో ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా అన్ని కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టవద్దు. అలాగే షార్ట్స్ వేసుకోవద్దు. వీటివల్ల మీ చర్మానికి బ్యాక్టీరియా అంతా సోకుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.