https://oktelugu.com/

orthorexia : ఆర్థోరెక్సియా అంటే మీకు తెలుసా? మీరు డైట్ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారా?

ఆర్థోరెక్సియా అంటే ఆరోగ్యకరమైన ఆహారం కోసం అధిక శ్రద్ధతో ఆహారాలను ఎంచుకొని వాటి గురించి ప్లాన్ చేసుకొని తినడం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 17, 2024 / 03:00 AM IST

    orthorexia

    Follow us on

    orthorexia : ఆర్థోరెక్సియా అంటే ఆరోగ్యకరమైన ఆహారం కోసం అధిక శ్రద్ధతో ఆహారాలను ఎంచుకొని వాటి గురించి ప్లాన్ చేసుకొని తినడం. ప్రస్తుతం చాలా మంది ఏది పడితే అదే తింటున్నారు. ఆహారం పట్ల కొంచెం కూడా శ్రద్ధ పెట్టడం లేదు. మరికొందరు సమయం లేదని ఆహారం కూడా తినకుండా పరుగులు పెడుతున్నారు. ఇక ఈ చలికాలంలో ఇది మరింత ఎక్కువ కనిపిస్తుంటుంది. ఉదయం లేవాలంటే చలి ఎక్కువ. అందుకే ఆలస్యంగా నిద్ర లేచి త్వరగా రెడీ అయ్యి తినకుండా వెళ్లిపోతుంటారు. కాని ఇలాంటి వారు తర్వాత చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే మీ డైట్ ప్లాన్ పక్కాగా ఉండాలి.

    ఆర్థోరెక్సియా ఉన్న వ్యక్తులు పరిశోధన చేసి మరీ ప్రణాళిక చేసుకుంటారు. వీరు భోజనం సిద్ధం చేయడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. వారి ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్త తీసుకుంటారు. అయితే వీరు మొత్తం ఆహార సమూహాలను తొలగించి నిర్దిష్ట “ఆరోగ్యకరమైన” ఆహారాన్ని మాత్రమే చేర్చుకుంటారు. దీని ద్వారా వారి ఆహారాన్ని చాలా వరకు పరిమితం చేసుకుంటారు. మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అయితే అందరూ చెప్పే ఆరోగ్య ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా, తప్పుడు సమాచారానికి బలి కాకుండా వీరు పూర్తి డైట్ ప్లాన్ తో వారి శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి పూర్తిగా కష్టపడతారు.

    ఇలా పూర్తిగా డైట్ ప్లాన్ చేసుకున్న వారు. ఆర్థోరెక్సియాను ఫాలో అయ్యేవారు ఆహార నియమాల ను మధ్యలో పాటించకపోయినా, ఏదైనా ఆటంకం కలిగినా సరే చాలా బాధ పడతారు. ఆందోళన లేదా స్వీయ-విమర్శలను అనుభవిస్తుంటారు. అంటే పూర్తిగా దానికి కారణం వీరే అని బాధ పడుతుంటారు. వారి ఆహారపు అలవాట్లు సాంఘిక ఒంటరితనానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వారు సామాజిక సమావేశాలలో లేదా ఫంక్షన్ లో ఉన్నప్పుడు అందరితో కలిసి వీరు కనీసం భోజనం కూడా చేయలేరు.

    ఆర్థోరెక్సియా రోజువారీ జీవితం, సంబంధాలు, మొత్తం శ్రేయస్సుతో జోక్యం చేసుకోవచ్చు. ఇది పోషకాహార లోపం, బరువు తగ్గడం లేదా పెరగడం, అలసట, నిరాశ, ఆందోళన వంటి తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య పరిణామాలను కలిగిస్తుంది. చికిత్సలో సమతుల్య ఆహారం, అబ్సెసివ్ ప్రవర్తనలపై దృష్టి సారించే చికిత్స ఉంటుంది. వీరు ఎంత జాగ్రత్త తీసుకుంటారో? వారికి అదే చేటు అవుతుంది. అందుకే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఇతరులతో కూర్చొని మాట్లాడినా సరే కనీసం మంచి నీరు తీసుకోవడానికి కూడా భయపడతారు ఈ ఆర్థోరెక్సియాను కలిగి ఉన్న వ్యక్తులు.