Cancer: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. అయితే మహిళలకు ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, యోని క్యాన్సర్ వంటివి వస్తుంటాయి. పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటాయి. ఏటా ఎందరో ఈ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. ఈ సమస్య వస్తే తగ్గడం చాలా కష్టం. దీని నుంచి బయట పడాలంటే తప్పకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వీటితో పాటు జీవనశైలిలో కూడా అలవాట్లు మార్చాలి. ఎందుకంటే మనం జీవనశైలి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది అనారోగ్యమైన ఫుడ్ తినడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇంట్లో ఉండే ఫుడ్ కంటే బయట ఫుడ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటివల్ల కూడా క్యాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి విముక్తి చెందాలంటే మాత్రం కొన్ని వ్యాయామాలు చేయాలి. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యోగేంద్ర పర్వతాసన
ఈ ఆసనం వేయడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ ఆసనం వేసేటప్పుడు చేతులను పైకి పెట్టి ఊపిరి పీల్చుకోవాలి. ఇలా ఒక పది నిమిషాల పాటు చేయడం వల్ల పొత్తికడుపులోని నొప్పి తగ్గడంతో పాటు క్యాన్సర్ సమస్యలు అన్ని తగ్గతాయి. అలాగే శరీరంలోని రక్తం మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన అన్ని తగ్గుతాయి. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
యోగేంద్ర పవనముక్తాసన
వెనుకగా పడుకుని మోకాళ్లను మీ చేతులతో పట్టుకుని ఛాతీ దగ్గరకు తీసుకురావాలి. ఆ తర్వాత ఒక పదినిమిషాల పాటు ఊపిరి పీల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ నిరోధకాలు అన్ని క్లియర్ అవుతాయి. అలాగే పొత్తి కడుపులోని నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు అన్నింటి నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
యోగేంద్ర శవాసన
మీ వెనుకభాగంలో పడుకుని చేతులు, కాళ్లు కాస్త దూరంగా ఉంచాలి. ఇలా చేసి ఒక పది నిమిషాల పాటు కళ్లు మూసుకుని ఊపిరి పీల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు నిద్రలేమి సమస్య నుంచి విముక్తి చెందుతారు.
యోగేంద్ర ప్రాణాయామం
ఈ ఆసనం వేయడం వల్ల పొత్తి కడుపులో నొప్పి తగ్గుతుంది. క్యాన్సర్ సమస్యలను తగ్గించడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఈ ఆసనం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
యోగేంద్ర ప్రాణాయామం
ఈ ఆసనం వేయడం వల్ల క్యాన్సర్ సమస్యలు క్లియర్ కావడంతో పాటు వెన్నెముక నిటారుగా ఉంటుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడంతో పాటు మంటను తగ్గిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.