Homeబిజినెస్Jobs: ఐటీఐ అర్హతతో ప్రముఖ సంస్థలో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Jobs: ఐటీఐ అర్హతతో ప్రముఖ సంస్థలో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Jobs: ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. మొత్తం 98 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్‌ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కనీసం […]

Jobs: ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. మొత్తం 98 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్‌ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

Jobs
Jobs

కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది ట్రెయినింగ్‌ వ్యవధి కోసం ఉద్యోగులను ఎంపిక చేస్తారని సమాచారం.

Also Read: మచిలీపట్నం బెయిల్ లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ జాబ్స్.. భారీ వేతనంతో?

అకాడమిక్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 7,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

నిరుద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే https://fact.co.in/ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

 

Also Read: సికింద్రాబాద్‌ రైల్వేలో 81 జూనియర్‌ ఇంజినీర్‌ జాబ్స్.. భారీ వేతనంతో?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper