Career Tips: కరోనా కాలం తరువాత ఉద్యోగల పరిస్థితి దయనీయంగా మారింది. అంతర్జాతీయ పరిస్థితులతో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో? ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. అయితే చాలా మంది ఉద్యోగం ఉన్నన్నాళ్లు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. జల్సాలు చేస్తూ సమయాన్ని వృథా చేస్తారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల వల్ల ఉద్యోగం కోల్పోతే తీవ్ర మనస్థాపానికి గురవుతారు. అయితే జాబ్ పోయిన సందర్భంలో ఎలాంటి టెన్షన్ పడకుండా.. డబ్బులు రావాలంటే ఈ చిన్న పనిచేయాలి. అదేంటంటే?
ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు. పురుషుడన్నాక ఏదో ఒక పని చేయడం తప్పనిసరి. కానీ కొందరు ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతారు. మరికొందరు వ్యాపారం చేస్తారు. ఏ పని చేసినా శాశ్వతంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ ఒక్కోసారి జాబ్ కోల్పోవాల్సి వస్తుంది. వ్యాపారంలో నష్టం వస్తుంది. ఇలాంటి సమయంలో తీవ్ర మనస్థాపానికి గురవుతారు. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆవేదనకు గురవుతారు.
ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ప్రీప్లాన్ గా ఒక చిన్న పనిచేయాలి. అదేంటంటే ముందుగానే ‘ఎమర్జెన్సీ ఫండ్’ ను ఏర్పాటు చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర పరిస్థితులతో పాటు నష్టం జరిగినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఎమర్జున్సీ ఫండ్ ను ప్రతీ నెల బ్యాంకులో సేవింగ్స్ చేసుకోవచ్చు. లేదా ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలనేది వారి ఆదాయాన్ని బట్టి ఉంటుంది.
ఒక వ్యక్తి ఉద్యోగం చేసినప్పుడు తనకు నెలవారీ ఖర్చులు ఏముంటాయి? అనేది ముందుగా తెలుసుకొని ఆ మొత్తాన్ని ప్రత్యేకంగా సేవ్ చేసుకోవాలి. ఉదాహరణకు నెలవారీ ఖర్చులు రూ.10,000 ఉంటే ఆరు నెలలకు సరిపడా అంటే రూ.60,000ను ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసుకోవాలి. ఈ ఫండ్ ను ఒకేసారి బ్యాంకులో సేవ్ చేసుకోవచ్చు. లేదా నెలలా ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఫండ్ ద్వారా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. వీటి ద్వారా ఉద్యోగం కోల్పోయినప్పడు నష్ట నివారణ చేసుకోవచ్చు.