Child Weight: పిల్లలు బరువు పెరగడం లేదా? అయితే ఇలా చేయండి

ఉన్న బరువు కంటే తగ్గుతున్నారా? లేదా ఉన్న బరువు ఉంటున్నారా అనేది తల్లిదండ్రులు పరీక్షిస్తుండాలి. పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నా, పోషకాలు, ప్రొటీన్లు సరిగ్గా లేనప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.

Written By: Swathi, Updated On : June 27, 2024 10:40 am

Child Weight

Follow us on

Child Weight: ప్రస్తుతం చాలా మంది పిల్లలు బరువు పెరగడం లేదు. కాస్త యాక్టివ్ గా ఉన్నా సరే బరువు మాత్రం చాలా తక్కువ ఉంటున్నారు. చూడటానికి బొద్దుగా, ముద్దుగా కనిపిస్తే పిల్లలు అందంగా అనిపిస్తారు. కానీ సన్నగా ఉంటూ యాక్టివ్ మోడ్ లో కూడా ఉండటం లేదు పిల్లలు. ఆటలు ఆడుకుంటూ కొంచెం కూడా తినడం లేదు. అమ్మ మారం చేసినా వద్దంటూ ఉంటారు కానీ తినరు. బరువు పెరగరు. అయితే పిల్లలు బరువు పెరగకపోవడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉన్న బరువు కంటే తగ్గుతున్నారా? లేదా ఉన్న బరువు ఉంటున్నారా అనేది తల్లిదండ్రులు పరీక్షిస్తుండాలి. పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నా, పోషకాలు, ప్రొటీన్లు సరిగ్గా లేనప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. అందుకే వారి ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. జంక్ ఫుడ్ ను ఎక్కువ తీసుకోవడం, పోషకాహారాన్ని తక్కువ తీసుకోవడం వంటివి పిల్లల బరువును సరిగ్గా ఉంచవు. కొంత మంది పిలల్లు ఆహారంలో ఉండే ప్రోటీన్లు, పోషకాలను జీర్ణం చేసుకోవడం లో వీక్ గా ఉంటారు. ఇలాంటప్పుడు కూడా వారి బరువు ఎక్కువగా పెరగదట.

థైరాయిడ్, ఇతర ఆరోగ్య సమస్యలు, చాలినంత నిద్ర లేకపోతే కూడా వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాదు బరువు కూడా పెరగరట. అయితే ముఖ్యంగా మీ పిల్లలు ఎందుకు బరువు పెరగడం లేదు అనే విషయాలను తెలుసుకొని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లల వెయిట్, హైట్ గ్రోత్ బాగుంటుంది అంటున్నారు నిపుణులు.

కొందరు తల్లిదండ్రులు వైద్యులను ప్రోటీన్ పౌడర్లు, లేదంటే ఇతరత్రా ఆహారాలను సజెస్ట్ చేయమని అడుగుతుంటారు. కానీ ఇంట్లో చేసిన ఆహారాల వల్లనే పిల్లలు మంచి బరువు పెరుగుతారని అంటున్నారు నిపుణులు. ఉగ్గు లేదా కూరగాయలు, పండ్లు వంటివి పిల్లలకు క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల వారి బరువును ఆరోగ్యంగా పెంచవచ్చు. రోగనిరోధక శక్తిని కూడా పెంచవచ్చు.