Jio Offer: భారత టెలికాం రంగంలో Jio దూసుకుపోతుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రతీ రీచార్జ్ తో అన్ లిమిటెడ్ కాల్స్ ను ఇవ్వడంతో పాటు వందకు పైగా ఎస్ ఎంఎస్ లు పంపించుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలాగే డేటా కూడా ఒక్కోసారి తక్కువ ధరకే అపరిమితంగా ఇస్తుంది. తాజాగా సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ను రీచార్జ్ చేసుకుంటే అపరిమిత కాల్స్ తో పాటు డేటా లభిస్తుంది. అంతేకాకుండా Jio Tv, Jio Cinema ఉచితంగా సబ్ స్క్రిప్షన్ పొందుతారు. ఈ ఆఫర్ కు సంబంధించిన వివరాలను రిలీజ్ చేసింది. వీటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
రూ.395 పెట్టి రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది. ఇందులో వినియోగదారులు సాధారణ కాల్స్ అపరిమితంగా ఉంటాయి. ఎస్టీడీ కాల్స్ ను కూడా వాడుకోవచ్చు. దీనిని రీచార్జ్ చేసుకుంటే 6 జీబీ ఇంటర్నెట్ డేటా వస్తుంది. ఇది హై స్పీడ్ గా ఉంటుంది. 6 జీబీ డేటా పరిమితి ముగిసిన తరువాత 64 కేబీహెచ్ పీ వేగంతో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ డేటా పూర్తయిన తరువాత రూ.180 లకే 30 బీజీ డేటాను యాక్స్ స్ చేసుకోవచ్చు.
ఈ ప్లాన్ లో వెయ్యి ఎస్ఎంఎస్ లు వస్తాయి.అయితే దీనిని రీచార్చ్ చేసుకోవాలంటే మాత్రం కొన్ని యాప్స్ లోనే అందుబాటులో ఉంది. ఇది మైజియో యాప్ లేదా జియో డాట్ కాప్ లో మాత్రమే లభ్యమవుతుంది. పేటీఎంలలో అస్సలు కనిపించదు. వినియోగదారులకు తక్కువ డేటా ఉపయోగించుకోవడంతో పాటు అపరిమిత కాల్స్, ఎక్కువ సంఖ్యలో ఎస్ఎంఎస్ నుం పంపించుకోవచ్చు.ఈ రీచార్జ్ ప్లాన్ తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ల సబ్ స్క్రిప్లన్లు పొందుతారు.