Jio Cinema Premium Plan: ఐపీఎల్ ప్రసారాలను పూర్తిగా ఉచితంగా ప్రసారం చేసిన జియో సినిమా ఇక నుంచి చార్జీలు వసూలు చేయనుంది. కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా తెలుగు, హిందీ మూవీస్ తో పాటు హాలీవుడ్ చిత్రాలను కూడా ప్రసారం చేయనుంది. అయితే ఇందుకోసం ముందుగా ఏడాది ప్లాన్ ను పరిచయం చేస్తూ సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలని తెలిపింది. ఒక్కసారి రూ.999 తో రీచార్జ్ చేస్తే సంవత్సరం పాటు సినిమాలను చూడొచ్చు. వీటితో పాటు ఎప్పటిలాగే ఐపీఎల్ ను వీక్షించవచ్చు. అలాగే ఈ ప్లాన్ కింద ఒకేసారి నాలుగు డివైజుల్లో ప్రసారాలను చూసేందుకు అవకాశం ఇచ్చింది.
ప్రస్తుతానికి జియో సినిమా వార్షిక ప్లాన్ మాత్రమే తీసుకొచ్చింది. ఆ తరువాత సబ్ స్క్రైబర్లను పెంచుకొని కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మొదట్లో పీపా వరల్డ్ కప్ ను ప్రసారం చేసిన జియో సినిమా ఆ తరువాత ఐపీఎల్ ను ఉచితంగా ప్రసారం చేసింది. దీంతో చాలా మంది జియో సినిమా యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. హెచ్ డి క్వాలిటీతో లైవ్ ప్రసారం చేయడంతో చాలా మంది ఈ యాప్ లోనే ఐపీఎల్ ను వీక్షించారు. అయితే చాలా మంది ఎప్పటికీ ఉచితంగానే దీనిని ప్రసారం చేస్తారని అనుకున్నారు. కానీ కొత్తగా మినిమం చార్జితో సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలని కోరింది.
జియో సినిమాకు సబ్ స్క్రిప్షన్ పొందాలంటే దీనికి సంబంధించిన వెబ్ సైట్ లోకి వెళ్లాలి. లేదా యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోనూ ప్లాన్ ను కొనుగోలు చేయొచ్చు. సంవత్సరానికి రూ.999 అంటే నెలకు రూ.83.25 చార్జి పడుతుంది. ఈ ప్లాన్ ద్వారా తెలుగు, హిందీ సినిమాలు, ఐపీఎల్ మత్రమే కాకుండా హాలీవుడ్ సినిమాలను చూడొచ్చు. ముఖ్యంగా హెచ్ బీవో ప్రసారం చేసే ‘ ద లాస్ట్ ఆఫ్ అజ్’, ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి కంటెంట్ ను చూడొచ్చు.
ఇక జియో ప్రీమియం కొనుగోలు చేసిన వారితో పాటు మరో ముగ్గురు యూజర్స్ గా ఉండొచ్చ. ఒకేసారి నాలుగు డివైజుల్లో తమకు నచ్చిన కంటెంట్ ను చూసుకోవచ్చు. సినిమాలు, స్పెషల్ ఈవెంట్స్, మ్యూజిక్ అన్నీ హై క్వాలిటీ తో పాటు హెచ్ డీ వెర్షన్ లో జియో సినిమా అందిస్తుంది. ఇప్పటికే జియో యాప్ ను ఉచితంగా మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మరి ప్రీమియం అంటే ఎంత మంది సబ్ స్క్రైబర్స్ గా మారుతారో చూడాలి.