NTR- Kodali Nani: కొడాలి నానితో పరిచయం స్నేహంగా ఎలా మారింది. మొదటి సారి తన తాత సీనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్నదెప్పుడు? అమ్మే తన సర్వస్వం అని చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్ తన మనసులోని భావాలను ప్రజల ముందు ఉంచారు. ఏబీఎన్ లో ప్రసారవుతున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎప్పుడో సుమారు 10 యేళ్ల క్రితం జరిగిన ఆ ఇంటర్వ్యూ వీడియోను ఇటీవల విడుదల చేశారు. క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది.
10వ తరగతి పూర్తయి తరువాత వాళ్ల జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారు ఇంటి నుంచి దూరంగా ఉంచి చదివిచాలని అనుకున్నారట. ఆ వయసులో ఫ్రెండ్సు, అల్లరి ఎక్కువవుతుందని అలా భావించారని ఆయన చెప్పుకొచ్చారు. అలా వెళ్లడం ఇష్టం లేదని, ఇంటి వద్దనే ఉండాలనేది బలమైన కోరికగా చెబుతున్నా వినలేదట. చివరకు తీసుకెళ్లి ఎలాగొలా గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ లో హాస్టల్లో చేర్పించారట. దాంతో ఆయన
ఇంటి పట్టున ఉండొచ్చని భావించి కాలు కూడా విరగొట్టుకున్నారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
హాస్టల్లో ఉన్న సమయంలో తరుచూ కొడాలి నానికి ఫోన్ చేసి హైదరాబాదు ఇంటిలో దింపిరావాలని కోరేవాడినని జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలా, నాని అతని స్నేహితులతో పరిచయం ఏర్పడిందని వివరించారు. ఇక, హాస్టల్లో ఉండటానికి ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణం తన అమ్మ అని అన్నారు. ఆమెను విడిచి ఉండలేక అలా చేశానని అన్నారు. అమ్మే సర్వస్వం అని చెప్పుకొచ్చారు.
కాగా, తాత సీనియర్ ఎన్టీఆర్ ను కూడా కలుసుకున్నది 11 వయసులోనట. ఎన్టీఆర్ చూడాలని కబురు పెడితే 103 డిగ్రీలు ఉన్న తనను హడావుడిగా రెడీ అయి వెళ్లానని వివరించారు. మరెన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించిన జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నానితో పెరిగిన పరిచయం ఇప్పటికీ స్నేహం పదిలంగా ఉంది. కాగా, రాజకీయాల్లోకి కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడుగానే పరిచయమవడం విశేషం.