Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ (Champions trophy) లో పాకిస్తాన్ (Pakistan) ప్రదర్శన దారుణంగా ఉంది. న్యూజిలాండ్ (NZ vs PAK), భారత్( IND vs PAK) చేతుల్లో ఓడిపోయింది. ఫలితంగా గ్రూప్ – ఏ లో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. దీంతో పాకిస్తాన్ గట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. వరుస ఓటముల నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు కోచ్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు తాత్కాలిక కోచ్ గా అకిబ్ జావేద్ కొనసాగుతున్నాడు. అతడితోపాటు సహాయక సిబ్బందిపై కూడా వేటువేస్తానని తెలుస్తోంది. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోందని సమాచారం. గత ఏడాది పాకిస్తాన్ జట్టు కోచ్ పదవికి గ్యారి కిర్ స్టెన్ రాజీనామా చేశాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్ గా అకిబ్ ను నియమించింది.. జాసెన్ గిల్లెస్పీ కూడా రాజీనామా చేయడంతో.. టెస్ట్ జట్టుకు కూడా అకిబ్ ను కోచ్ గా తీసుకున్నారు.. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు విఫలం కావడంతో అకిబ్ ను తొలగించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అతడు కోచ్ పదవిలో కొనసాగడం కష్టమని పాక్ మీడియా చెబుతోంది. అకిబ్ తో పాటు సహాయక సిబ్బందిని కూడా తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది.
వారు రావడం అనుమానమే
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శన చేసింది. టోర్నీ నుంచి ముందుగానే నిష్క్రమించింది. అయితే ఇప్పుడు ఆ జట్టుకు స్పాన్సర్లు రావడం కష్టమేనని తెలుస్తోంది. ఇంకా మిగతా మ్యాచ్లకు కూడా అభిమానులు వస్తారో? రారో? అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది. ఒకవేళ ప్రేక్షకులు మైదానానికి రాకపోతే ప్రసార హక్కులు దక్కించుకున్న వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. స్పాన్సర్లు యాడ్స్ ఇవ్వడానికి ముందుకు రారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు అంధకారం అవుతుంది. అందువల్లే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లపై ఆ దేశ మాజీ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఆట ఆడుతున్నారని మండి పడుతున్నారు. భారత జట్టుతో దిక్కుమాలిన ఆట ఆడారంటూ విమర్శిస్తున్నారు. ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తి పూర్తిగా కొరవడిందని.. ట్రై సిరీస్ లోను న్యూజిలాండ్ చెప్పిన ఓడిపోయారని.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే ఇంటికి వచ్చారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆట తీరు పూర్తిగా మార్చుకోవాలని.. లేనిపక్షంలో జట్టు పరువు మరింత పాతాళానికి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.