Homeలైఫ్ స్టైల్Phone Tapping: మీ ఫోన్‌ ట్యాప్‌ అవుతోందా.. అయితే ఇలా తెలుసుకోండి!

Phone Tapping: మీ ఫోన్‌ ట్యాప్‌ అవుతోందా.. అయితే ఇలా తెలుసుకోండి!

Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌.. తెలంగాణలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక భద్రత పెరుగుతుందని అనుకుంటే.. రానురాను స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల భద్రత, ప్రైవసీ ప్రశ్నార్థకమవుతోంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా ఎస్‌ఐబీ అధికారులు పలువురు రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ట్యాపింగ్‌ అందరినీ భయపెడుతోంది.

67 శాతం మంది ఆందోళన..
ఫోన్లు, ఇత గాడ్జెట్స్‌ భద్రతపై ఇటీవల డెలాయిట్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో 67 శాతం మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు తమ గాడ్జెట్స్‌ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. 2023 ఏడాదితో పోలిస్తే ఆందోళన 54 శాతం పెరిగిందని తెలిపింది. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో పెగాసెస్‌ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. తాజాగా తెలంగాణలో ఎస్‌ఐబీ ఫోన్‌ ట్యాపింగ్‌ దుమారం రేపోతోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల వ్యక్తిగత వ్యవహారాలు, గోప్యత, భద్రతపై గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంతో తమ ఫోన్‌ హ్యాక్‌ అయిందా, ట్యాప్‌ అయిందా అనేది ఎలా గుర్తించాలి. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఫోన్‌ ట్యాపింగ్‌ను ఎలా గుర్తించాలి?
= ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుతున్న సమయంలో అసాధారణ శబ్దాలు, అస్పష్టంగా దూరం నుంచి శబ్దాలు రావడం కెమెరా, మైక్రోఫోన్లు యాదృచ్ఛికంగా ఆన్‌ కావడం. ఐఫోన్, శాంసంగ్‌ ఫోన్లలో అయితే స్క్రీన్‌ పైభాగంలో నారింజ లేదా ఆకుపచ్చ లైట్‌ వెలుగుతుంది.

= ఉన్నటుండి ఫోన్‌ బ్యాటరీ చార్జింగ్‌ తగ్గిపోవడం, బ్యాటరీ కండీషన్‌ సరిగానే ఉన్నా పెద్ద యాప్స్‌ అవీ వాడకపోయినా తరచుగా చార్జి చేస్తున్నా వేగంగా అయిపోతుంటే అప్రమత్తం కావాలి.

= ఫోన్‌ షట్‌డౌన్‌ కావడానికి చాలా సమయం పడుతున్నా, ప్రత్యేకించి కాల్, టెక్ట్స్, ఈమెయిల్‌ లేదా వెబ్‌ బ్రౌజింగ్‌ తర్వాత ఇలా జరుగుతోంటే. థర్ట్‌ పార్టీకి మన డేటాను ట్రాన్సి్మట్‌అవుతున్నట్లు అనుమానించాలి.

= మొబైల్‌ స్పెవేర్‌ ఫోన్‌ను నిరంతరం ట్రాక్‌ చేస్తూ, డేటాను ఎక్కువ వాడుకుంటుంది. ఫోన్‌ చార్జింగ్‌లో లేకపోయినా, ఎక్కువ మాట్లాడకపోయినా ఉన్నట్టుండి ఫోన్‌ వేగంగా వేడెక్కుతున్నా అనుమానించాల్సిందే. మామూలుగా ఉన్నపుడు ఫోన్‌ విపరీతంగా వేడెక్కడం ట్యాపింగ్‌కు సంకేతంగా గుర్తించాలి. హ్యాకర్లు మన ఫోన్‌ను టార్గెట్‌ చేశారా అని చెక్‌ చేసుకోవాలి.

= ఇక ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా.. కాల్స్‌ నోటిఫికేషన్స్‌ స్వీకరిస్తూ ఆకస్మికంగా రీబూట్‌ అవుతున్నా రిమోట్‌ యాక్సెస్‌ అయిందనడానికి సూచికగా భావించాలి. జాగ్రత్త పడాలి.

= స్మార్ట్‌ ఫోన్‌ అకస్మాత్తుగా స్లో కావడం. యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేశారో ట్రాక్‌ చేసి, మీరు ఇన్‌స్టాల్‌ చేయని యాప్‌లు కనిపిస్తే.. అది హ్యాకింగ్‌కు సంకేతంగా భావించాలి.

= ఫోన్‌ తరచుగా రీబూట్లు, షట్లెన్, లేదా రీస్టార్ట్‌ అవుతూ ఉండవచ్చు. స్క్రీన్‌ లైట్లో మార్పులు కనిపిస్తే ఏదైనా మల్వేర్‌ ఎఫెక్ట్‌ అయి ఉంటుందని భావించాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
= ఈ జాగ్రత్తలు పాటిస్తే మొబైల్‌ భద్రత కోసం విశ్వసనీయ యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనుమానాస్పద లింక్‌లు, మెస్సేజ్‌లను క్లిక్‌ చేయొద్దు.

= ఇక మనఫోన్‌ ట్యాప్‌ అయిందో లేదో తెలుసుకోవడానికి ##4636## కోడ్‌కు డయల్‌ చేయాలి. మీ ఫోన్‌ ట్రాక్‌ అవుతుందా లేదా ట్యాప్‌ అవుతుందా తెలియజెప్పే కోడ్‌(నెట్మానిటర్‌) కోడ్, ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టంను బట్టి ఈ కోడ్‌కు డయల్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌డ్రాయిడ్‌ యూజరుల ##197328640## లేదా ##4636## కు డయల్‌ చేయాలి. ఐఫోన్‌ యూజర్లు అయితే 3001#12345# కు డయల్‌ చేయాలి.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version