Phone Tapping
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణలో ఇప్పుడిదే హాట్ టాపిక్. స్మార్ట్ ఫోన్ వచ్చాక భద్రత పెరుగుతుందని అనుకుంటే.. రానురాను స్మార్ట్ ఫోన్ వినియోగదారుల భద్రత, ప్రైవసీ ప్రశ్నార్థకమవుతోంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఎస్‌ఐబీ అధికారులు పలువురు రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ట్యాపింగ్ అందరినీ భయపెడుతోంది.
67 శాతం మంది ఆందోళన..
ఫోన్లు, ఇత గాడ్జెట్స్ భద్రతపై ఇటీవల డెలాయిట్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో 67 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ గాడ్జెట్స్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. 2023 ఏడాదితో పోలిస్తే ఆందోళన 54 శాతం పెరిగిందని తెలిపింది. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో పెగాసెస్ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. తాజాగా తెలంగాణలో ఎస్‌ఐబీ ఫోన్ ట్యాపింగ్ దుమారం రేపోతోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల వ్యక్తిగత వ్యవహారాలు, గోప్యత, భద్రతపై గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంతో తమ ఫోన్ హ్యాక్ అయిందా, ట్యాప్ అయిందా అనేది ఎలా గుర్తించాలి. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఫోన్ ట్యాపింగ్‌ను ఎలా గుర్తించాలి?
= ఫోన్ కాల్స్ మాట్లాడుతున్న సమయంలో అసాధారణ శబ్దాలు, అస్పష్టంగా దూరం నుంచి శబ్దాలు రావడం కెమెరా, మైక్రోఫోన్లు యాదృచ్ఛికంగా ఆన్ కావడం. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లలో అయితే స్క్రీన్ పైభాగంలో నారింజ లేదా ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది.
= ఉన్నటుండి ఫోన్ బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోవడం, బ్యాటరీ కండీషన్ సరిగానే ఉన్నా పెద్ద యాప్స్ అవీ వాడకపోయినా తరచుగా చార్జి చేస్తున్నా వేగంగా అయిపోతుంటే అప్రమత్తం కావాలి.
= ఫోన్ షట్‌డౌన్ కావడానికి చాలా సమయం పడుతున్నా, ప్రత్యేకించి కాల్, టెక్ట్స్, ఈమెయిల్ లేదా వెబ్ బ్రౌజింగ్ తర్వాత ఇలా జరుగుతోంటే. థర్ట్ పార్టీకి మన డేటాను ట్రాన్సి్మట్‌అవుతున్నట్లు అనుమానించాలి.
= మొబైల్ స్పెవేర్ ఫోన్‌ను నిరంతరం ట్రాక్ చేస్తూ, డేటాను ఎక్కువ వాడుకుంటుంది. ఫోన్ చార్జింగ్‌లో లేకపోయినా, ఎక్కువ మాట్లాడకపోయినా ఉన్నట్టుండి ఫోన్ వేగంగా వేడెక్కుతున్నా అనుమానించాల్సిందే. మామూలుగా ఉన్నపుడు ఫోన్ విపరీతంగా వేడెక్కడం ట్యాపింగ్‌కు సంకేతంగా గుర్తించాలి. హ్యాకర్లు మన ఫోన్‌ను టార్గెట్ చేశారా అని చెక్ చేసుకోవాలి.
= ఇక ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా.. కాల్స్ నోటిఫికేషన్స్ స్వీకరిస్తూ ఆకస్మికంగా రీబూట్ అవుతున్నా రిమోట్ యాక్సెస్ అయిందనడానికి సూచికగా భావించాలి. జాగ్రత్త పడాలి.
= స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా స్లో కావడం. యాప్‌లను ఇన్‌స్టాల్ చేశారో ట్రాక్ చేసి, మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు కనిపిస్తే.. అది హ్యాకింగ్‌కు సంకేతంగా భావించాలి.
= ఫోన్ తరచుగా రీబూట్లు, షట్లెన్, లేదా రీస్టార్ట్ అవుతూ ఉండవచ్చు. స్క్రీన్ లైట్లో మార్పులు కనిపిస్తే ఏదైనా మల్వేర్ ఎఫెక్ట్ అయి ఉంటుందని భావించాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
= ఈ జాగ్రత్తలు పాటిస్తే మొబైల్ భద్రత కోసం విశ్వసనీయ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనుమానాస్పద లింక్‌లు, మెస్సేజ్‌లను క్లిక్ చేయొద్దు.
= ఇక మనఫోన్ ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవడానికి ##4636## కోడ్‌కు డయల్ చేయాలి. మీ ఫోన్ ట్రాక్ అవుతుందా లేదా ట్యాప్ అవుతుందా తెలియజెప్పే కోడ్(నెట్మానిటర్) కోడ్, ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను బట్టి ఈ కోడ్‌కు డయల్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌డ్రాయిడ్ యూజరుల ##197328640## లేదా ##4636## కు డయల్ చేయాలి. ఐఫోన్ యూజర్లు అయితే 3001#12345# కు డయల్ చేయాలి.