Father: మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ అన్నారు. తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం. పిల్లల ఎదుగుదలకు తండ్రి తపన పడుతుంటాడు. కొడుకు ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. నిజానికి కొడుకు అభ్యున్నతికి నిరంతరం కష్టపడతాడు. కుమారుడి సామర్థ్యాన్ని పెంచేందుకు తండ్రే గురువులా వ్యవహరిస్తాడు. కొడుకును ఉత్తమంగా తీర్చిదిద్దే క్రమంలో అతడిలోని నైపుణ్యాలను అంచనా వేస్తూ ఎందులో ఆసక్తి ఉంటే అందులోనే తన తెలివితేటలు ప్రదర్శించే విధంగా మార్గనిర్దేశం చేస్తే జీవితంలో మరింత ఉన్నతంగా ఎదిగే అవకాశాలుంటాయి. కానీ తమ తండ్రి ఆశయాలు, తాత ఆశయాలు అంటూ ఇష్టం లేని వాటిని అంటగడితే మాత్రం అతడు ఎందులో కూడా రాణించడం కష్టమే.
ప్రతి వాడిలో ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి దానికి అనుగుణంగా శిక్షణ ఇస్తే అందులోనే రాటు దేలుతాడు. అతడికి అందించాల్సిన ప్రోత్సాహం అందిస్తూ ఎదిగేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు అందజేస్తే సరిపోతుంది. పిల్లల మనసు పక్కదారి పట్టకుండా ఎల్లప్పుడు లక్ష్యం పైనే గురి పెట్టేందుకు వెన్నంటి ఉండేలా చూసుకోవాలి. అంతేకాని అనవసర విషయాలను అంటగట్టకూడదు.
ఇంటి వాతావరణం కూడా బాగుండాలి. ఇంట్లో అల్లరి చిల్లర పనులు ఉండకుండా జాగ్రత్తలు వహించాలి. ఉన్నతమైన ఆలోచనలతోనే ఎప్పుడు ఉత్తమ అభిరుచి కలిగిన నేతల భావాలు, ఆశయాలను విడమర్చి చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లల మనోభావాలను గుర్తించాలి. వారిని అనుక్షణం ప్రోత్సహిస్తుండాలి. విషయంపై అవగాహన కల్పించాలి.
Also Read: Shobha Shetty: కార్తీకదీపం మోనిత కన్నీటి కష్టాలు తెలిస్తే గుండె తరుక్కుపోతుంది!
జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరం. ఏదైనా సాధించాలంటే పట్టుదలతో పాటు క్రమశిక్షణ ఓ కవచం లాంటిది. సోమరితనాన్ని దూరం చేసుకునే విలువలను ఎప్పుడు నేర్పుతుండాలి. విజయానికి కావాల్సిన దారులను గుర్తు చేస్తుండాలి. పిల్లల ఎదుగుదలకు నిరంతరం అడ్డంకులను దాటుకునేందుకు ఎప్పుడు ప్రణాళికలు రూపొందించుకోవాలి. జీవిత లక్ష్యం చేరే క్రమంలో తండ్రి గురువును మించిన స్థాయిలో కష్టపడతాడు.
కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో తండ్రి తనలోని ప్రతిభను కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది. తండ్రి కుమారుడిని మంచి స్థానంలో చూసుకునేందుకు తనకున్న శక్తి యుక్తులను పణంగా పెడతాడు.
Also Read: One child is enough: ఒక్కరే ముద్దు.. ఇద్దరు వద్దనుకుంటున్నారా? ఆలోచించాల్సిందే?