Dhoni- Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి జడేజా తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఎస్ కే కు రెండుసార్లు కప్ అందించిన ఆటగాళ్లు ఆ టీం సొంతం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో సీఎస్ కే తనదైన శైలిలో దూసుకుపోవడానికి కారణం జడేజానే అని చెబుతుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ టీం నుంచి జడేజాను తప్పిస్తున్నారనే వార్తతో అభిమానుల్లో కంగారు నెలకొంది. జడేజా లేని సీఎస్ కే కు విలువ ఉండదని చెబుతున్నారు. సీఎస్ కే విజయాల్లో జడేజా పాత్ర ఎంతో ఉందనే విషయం అందరు నమ్ముతుంటారు. ఈ క్రమంలో జడేజా నిష్క్రమణపై సందేహాలు వస్తున్నాయి.

జడేజా ఆటపై అందరికి తెలిసిందే. అతడు టీంలో ఉంటేనే విజయాలు సొంతం అవుతాయి. తన బ్యాట్ తో సమాధానం చెబుతుంటాడు. జట్టు ఆపద సమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు. జడేజా ఆటపై అందరికి విశ్వాసం ఎక్కువే. సీఎస్ కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా జడేజా ఆటపై మక్కువ ఎక్కువే. దీంతో జడేజా జట్టు నుంచి తప్పుకోవడంపై తన దైన శైలిలో మనసులో మాట బయటపెట్టాడు. జడేజా జట్టులో ఉండాల్సిందేనని సూచిస్తున్నాడు. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం కూడా ప్రసారం చేసింది. దీంతో జడేజా జట్టులో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాడు.
జట్టులో జడేజా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడు. అందుకే అతడు సీఎస్ కే కు ప్రధానమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దీంతో జట్టులో రవీంద్ర జడేజా ఉండాల్సిందేనని అందరు పట్టుబడుతున్నారు. జడేజా సీఎస్ కేతోనే కొనసాగే అవకాశం ఏర్పడింది. కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఏవో కొన్ని పుకార్లు వస్తుంటాయి. ఇందులో భాగంగానే జడేజా జట్టును వీడబోతున్నాడని పలు రకాల పుకార్లు రావడంతో అందరిలో అయోమయం నెలకొంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జడేజా లేని లోటు ఎంతో ఉంటుంది. అందుకే అందరు జడేజా జట్టుతోనే ఉండాలని కోరుకుంటున్నారు. సీఎస్ కే జట్టులో జడేజా కీలకమైన ఆటగాడనే సంగతి విధితమే. ఇక జడేజా తన ప్రస్థానాన్ని సీఎస్ కేతోనే కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నాడనే విషయం అర్థమవుతోంది. కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ లకు సంసిద్ధమవుతున్న సందర్భంలో జడేజాను జట్టులోనే కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు.