Alcohol: ప్రస్తుత రోజుల్లో మద్యం తీసుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. దాదాపు 98 శాతం మద్యం తాగేవారే. ఒక రెండు శాతం మాత్రం తాగని వారున్నారు. అల్కహాల్ ఒంటికి మంచిది కాదు. ప్రభుత్వమే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముతోంది. మద్యం తాగడం మంచి అలవాటు కాదని లేబుల్ వేసి మరీ అమ్ముతోంది. తాగిన తరువాత మీరు ఏమైపోయినా మాకు సంబంధం లేదని ముందే చెబుతోంది. కానీ మన వారు మాత్రం అది లేనిదే ముందుకు వెళ్లడం లేదు.
అయితే అల్కహాల్ తీసుకునే వారు తక్కువ మోతాదులో తీసుకున్నా నష్టమే అని కొత్త పల్లవి అందుకుంటున్నారు. అల్కహాల్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే శరీరంపై ప్రభావం చూపినట్లే తక్కువ తీసుకున్నా నష్టం చేస్తుందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అల్కహాల్ విషంతో సమానమని తేల్చింది. ఇది సైకో యాక్టివ్ అనే పదార్థంగా మారుతుందని దీంతో చాలా నష్టాలు ఉన్నాయని తెలిపింది. మద్యం మన ఆరోగ్యాన్ని దెబ్బ తీయకుండా ఉండాలంటే సాధారణంగానే తీసుకుంటే మంచిది.
ఇందులో ఇథనాల్ అధికంగా ఉండటం వల్ల పొట్ట, మెదడు, గుండె, పిత్తాశయం, కాలేయంపై తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది. రోజు మద్యం తాగేవారి కాలేయం వాపు ఎక్కుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఇది కాలేయం సిర్రోసిస్ సమస్యకు దారి తీస్తుంది. అల్కహాల్ గుండె కండరాలను పాడు చేస్తుంది. కార్డిమయోపతి వంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఇస్తుంది
మద్యం తాగే వారికి న్యూమోనియా, క్షయ వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ప్రపంచంలో 8 శాతం క్షయ రోగాలు మందు తాగడం వల్లే వస్తున్నాయి. మద్యం తాగడం వల్ల ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా మద్యం తాగడం వదిలిపెట్టడం లేదు. మందు తాగడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. ఆరోగ్యం దెబ్బ తింటుందని తెలిసినా ఎవరు పట్టించుకోవడం లేదు.