Gmail Space: విద్యార్థుల దగ్గర్నుంచీ కార్పొరేట్ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ జీ మెయిల్ ను యూజ్ చేస్తారు. మెజేజ్ లతో పాటు కొన్ని ప్రత్యేక ఫైల్స్ పంపించుకోవడానికి జీమెయిల్ ప్రధాన వాహకంగా పనిచేస్తుంది. అయితే కొందరికి జీమెయిల్ గురించి ఇప్పటికీ పూర్తిగా అవగాహన లేదు. ఇందులోకి వేల కొద్ది మెసేజ్ లు వస్తుంటాయి. వీటిలో సరైంది, కానిదీ తెలుసుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా స్పామ్ మెసేజ్ లతో జీమెయిల్ స్టోరేజ్ నిండుతుంది. దీంతో ముఖ్యమైన మెసేజ్ లు రాకుండా అడ్డుకుంటాయి. అయితే ఇన్ బాక్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి సమయం ఉండదు. కానీ చిన్న ట్రిక్ తో జీ మెయిల్ లో ఉన్న స్పామ్ మెసేజ్ లను తొలగించి.. స్పేస్ పెంచుకోవచ్చు..
జీమెయిల్ కు ప్రతిరోజూ పదుల కొద్దీ స్పామ్ మెజేస్ లు వస్తుంటాయి. వీటితోనే స్టోరేజ్ ఫుల్ అవుతుంది. దీంతో ఇంపార్టెంట్ మెసేజ్ లు చూసుకోవడానికి వీలుండదు. ఈ క్రమంలో చిన్న పనితో మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. అందుకోసం మీరేం చేయాలంటే.. ముందుగా జీమెయిల్ లాగిన్ కావాలి.. ఆ తరువాత బ్లాక్ చేయాలనుకున్న స్పామ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత i సింబల్ పై క్లిక్ చేయాలి. అనంతరం బ్లాక్ పైకి ప్రెస్ చేయండి.. దీంతో మీకు నిరంతరం వచ్చే స్పామ్ మెయిల్ ఆగిపోతాయి. అంటే మీకు పంపించే వారి స్పామ్ మెసేజ్ లను మీరు బ్లాక్ చేస్తున్నట్లు.
అయితే స్పామ్ మెయిల్స్ ముందుగానే గుర్తించడానికి ఒక ఆప్షన్ ఉంది. సెర్చ్ బాక్స్ లో ఆన్ సబ్ స్క్రైబ్ అని టైప్ చేయండి.. అప్పుడు మీరు అన్ సబ్ స్క్రైబ్ చేయాలనుకునే జీమెయిల్స్ జాబితాను చూపిస్తుంది. వీటిలో మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని అన్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. అలా ఫిల్టర్ చేయడంతో చాలా వరకు మీకు అవసరం లేని ఈమెయిల్స్ రావు. ఇక అప్పటి వరకు ఉన్న వాటిని సెలెక్ట్ చేసి డెలీట్ చేయండి.
ఇలా చేయడం వల్ల ఇక నుంచి మీ స్టోరీజ్ ఫుల కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇంపార్టెంట్ ఈమెయిల్స్ వెంటనే గుర్తించవచ్చు. అనవసరపు ఈమెయిల్స్ తో జీ మెయిల్ స్టోరీజ్ ఫుల్ కావడం వల్ల ఎక్కువ స్పేస్ కొనుక్కోవాలని అడుగుతుంది. ఆ అవసరం లేకుండానే ఇలాంటి టిప్స్ తో అనవసరపు ఈమెయిల్స్ రాకుండా ఉంటే మీకు బడ్జెట్ కూడా సేప్ అవుతుంది. ఆన్లైన్ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ జీమెయిల్ యూజ్ చేస్తారు. అలాంటి వారికి ఇది మంచి ఆప్షన్ గా ఉంటుంది.