Phoenix Bird: మనం పక్కా వాస్తును నమ్ముతుంటాం. అన్ని వాస్తు ప్రకారమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. లేకపోతే ఇబ్బందులు వస్తాయని తెలుసు. అందుకే ఇల్లు కట్టుకునేటప్పుడే వాస్తును బాగా ఫాలో అవుతాం. ప్రతిది వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకోవడం విధిగా భావిస్తాం. ఇలా వాస్తు నిబంధనలు పక్కాగా అమలు చేసుకుని ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా జీవనం గడపాలని అందరు ఆశించడం మామూలే.
ఫినిక్స్ పక్షి
వాస్తు శాస్ర్తంలో ఫినిక్స్ పక్షికి ప్రాధాన్యం ఉంది. అసలు ఇలాంటి పక్షి లేకున్నా ఉందనే ఫీలింగ్ లో దాని బొమ్మను పెట్టుకోవడం సహజం. వాస్తు శాస్త్రంలో దీనికి విలువ బాగానే ఉంటుంది. ఈ పక్షి ఇంట్లో ఉంటే శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని విశ్వసిస్తారు. విజయానికి ఫినిక్స్ పక్షి ప్రతిరూపంగా చెబుతారు. ఇలా వాస్తు శాస్త్రంలో దీనికి ఎంతో గుర్తింపు తీసుకొచ్చారు.
ఈ పక్షి ఉందా?
ఫినిక్స్ పక్షి ఎక్కడ కనిపించదు. గ్రీకు పురాణంలో దీన్ని పునర్జన్మకు ప్రతీకగా చెబుతారు. వారి పూర్వీకుల బూడిద నుంచి తిరిగి జీవం పోసుకున్న పక్షిగా భావిస్తారు. క్రిష్టియానిటి తొలి రోజుల్లో దీన్ని మత చిహ్నంగా వాడేవారు. ఈ పక్షి చిత్రం లేదా విగ్రహాన్ని దక్షిణ దిశలో ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. డ్రాయింగ్ రూంలో ఉంచుకుంటే ఇంకా మంచిది. వాస్తు పక్షిని అమరపక్షి అని లేదా మాయ పక్షి అని కూడా పిలుస్తారు. దీని వల్ల మంచి లాభాలు కలుగుతాయని నమ్ముతుంటారు.
ఏ పక్షుల చిత్రాలు ఉంచకూడదు
ఇంట్లో కొన్ని పక్షుల బొమ్మలు, చిత్రాలు ఉంచితే నష్టాలు వస్తాయి. కొన్ని రకాల పక్షుల బొమ్మలు ఇంట్లో ఉంచుకుంటే ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. రాబందు, గబ్బిలం, కాకి, గుడ్లగూబ వంటి పక్షుల విగ్రహాలు ఇంట్లో అలంకరించుకోవడం వల్ల కష్టాలు వస్తాయి. అందుకే అలాంటి వాటి చిత్రాలునే ఇంట్లో పెట్టుకోవడం సురక్షితం కాదు.