Shave the beard every day: రోజు గడ్డం షేవ్ చేస్తే ప్రమాదమా.. ఎన్ని రోజులు ఒకసారి చేయాలి?

సాధారణంగా అబ్బాయిలు నెలకి ఒకసారి గడ్డం షేవ్ చేసుకుంటారు. ఎక్కువగా గడ్డం ఉండటం కంటే క్లీన్ షేవ్ ఉంటే అందంగా కనిపిస్తామని భావించి చేస్తారు. కొందరు ఎక్కువగా గడ్డం ఉంటేనే అమ్మాయిలకి నచ్చుతామనే అభిప్రాయంలో చేస్తారు. అయితే ముఖంపై ఎలా క్రిములు, దుమ్ము, దూళి కణాలు చేరుతాయో.. గడ్డం మీద కూడా అలానే చేరుతాయి.

Written By: Kusuma Aggunna, Updated On : October 8, 2024 4:51 pm

shave the beard every day

Follow us on

Shave the beard every day: అబ్బాయిలకి అందం గడ్డమే. ఎక్కువ శాతం అమ్మాయిలకు గడ్డం ఎక్కువగా ఉండే అబ్బాయిలు అంటేనే ఇష్టం. అయితే కొందరు ఎప్పుడో నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి షేవ్ చేసుకుంటారు. కానీ కొందరు అబ్బాయిలు మాత్రం ఎప్పుడు క్లీన్ సేవ్‌లోనే కనిపిస్తారు. కొంచెం గడ్డం ఉన్నా చాలు డైలీ తీసేస్తారు. కొందరు మాత్రం ఏదైనా ఫంక్షన్ లేదా బయటకు వెళ్లడం వంటివి ఉంటేనే షేవ్ చేస్తారు. గడ్డం ఎక్కువగా షేవ్ చేసుకోకపోయిన అందంగా కనిపించమనే భావనలో ఉంటారు. బాడీకి, డ్రెస్సింగ్‌కి తగ్గట్లుగా ఉండాలని ఉదయం లేచిన వెంటనే మొదట షేవ్ చేస్తారు. ఇలా ఒకరోజు లేదా రెండు రోజులు పర్లేదు. కానీ ఏడాది అంతా ఇలా చేయడం అసలు చర్మానికి మంచిదేనా? డైలీ గడ్డం షేవ్ చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయా? లేదా? అని చాలామందికి సందేహం ఉంది. మరి మీకు ఉన్న డౌట్‌ను క్లియర్ చేసేద్దామా.

సాధారణంగా అబ్బాయిలు నెలకి ఒకసారి గడ్డం షేవ్ చేసుకుంటారు. ఎక్కువగా గడ్డం ఉండటం కంటే క్లీన్ షేవ్ ఉంటే అందంగా కనిపిస్తామని భావించి చేస్తారు. కొందరు ఎక్కువగా గడ్డం ఉంటేనే అమ్మాయిలకి నచ్చుతామనే అభిప్రాయంలో చేస్తారు. అయితే ముఖంపై ఎలా క్రిములు, దుమ్ము, దూళి కణాలు చేరుతాయో.. గడ్డం మీద కూడా అలానే చేరుతాయి. రోజూ క్లీన్ షేవ్ చేసుకున్న వారి కంటే చేసుకోని వారికే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గడ్డం ఎక్కువగా ఉంటే అందులో దుమ్ము, దూళి వల్ల బ్యాక్టీరియా ఉండిపోతుంది. కాబట్టి రోజూ ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌తో గడ్డం శుభ్రం చేయాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాణ్యమైన ట్రిమ్మర్, రేజర్‌తో ప్రతీ రోజు షేవింగ్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు. గడ్డాన్ని ఎక్కువ నెలలు పాటు షేవ్ చేసుకోని వారికే ఇంకా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డైలీ గడ్డం షేవ్ చేసుకునే వారు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒక్కోరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. డైలీ షేవ్ చేసుకుంటే చర్మంపై మార్పులు రావచ్చు. కాబట్టి డాక్టర్‌ను ఒకసారి సంప్రదించాలి. అలాగే డైలీ షేవ్ చేసుకునేవారు.. చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఏదైనా మాయిశ్చరైజర్ వాడాలి. డైలీ షేవ్ చేసుకోవడం వల్ల మీ చర్మంలో ఏవైనా మార్పులు కనిపిస్తే చేయవద్దు. డాక్టర్‌ను సంప్రదించి చర్మానికి ఎలాంటి హాని జరుగుతుందా? లేదా తెలుసుకుని చేసుకోవాలి. అబ్బాయిలు అయిన కూడా చర్మ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.