https://oktelugu.com/

Black Holes :  భూమిని కూడా మింగే బ్లాక్ హోల్స్.. వీటి కథ ఏంటి?

బ్లాక్ హోల్ ను కృష్ణ బిలం అని కూడా అంటారు. అయితే ఇది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్‌టైమ్ ప్రాంతంగా చెబుతున్నారు పరిశోధకులు. ఈ బలమైన గురుత్వాకర్షణ శ‌క్తి నుంచి ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో వంటివి ఏవి కూడా తప్పించుకోలేవు అంటున్నారు నిపుణులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 8, 2024 / 04:51 PM IST

    Black Holes

    Follow us on

    Black Holes :  ఈ అనంత విశ్వంలో అంతుచిక్క‌ని ర‌హ‌స్యాలు ఎన్నో ఉన్నాయి. చంద్రునిపై ఇళ్లు క‌ట్టుకునే స్థాయికి మ‌నిషి ఎదిగారు. కానీ ఇప్పటికీ ఛేదించ‌లేని సృష్టి ర‌హ‌స్యాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ‘బ్లాక్ హోల్’ ఒక‌టి. భూమిని సైతం మింగేసే శ‌క్తి వీటికి ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ శ‌క్తి నుంచి మ‌న సూర్యుడు కూడా త‌ప్పించుకోలేడట. మరి ఈ బ్లాక్ హోల్ ఎంత శ‌క్తివంత‌మైన‌దో మీకు అర్థ‌మై ఉండాలి. బ్లాక్ హోల్స్ చాలా కాలంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్ర ఔత్సాహికుల ఆసక్తిని ఆకర్షించిన మనోహరమైన ఖగోళ వస్తువులు.

    బ్లాక్ హోల్ ను కృష్ణ బిలం అని కూడా అంటారు. అయితే ఇది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్‌టైమ్ ప్రాంతంగా చెబుతున్నారు పరిశోధకులు. ఈ బలమైన గురుత్వాకర్షణ శ‌క్తి నుంచి ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో వంటివి ఏవి కూడా తప్పించుకోలేవు అంటున్నారు నిపుణులు. అంటే అందులోకి ఒక్క‌సారి వెళ్తే ఇక అది మ‌న ద‌గ్గ‌ర నుంచి పోయిన‌ట్టే అని అనుకోవాల్సిందే. ఈ విషయంలో భూమి అయినా, సూర్యుడు అయినా.. ఇంకా మ‌రేదైనా ఈ బ్లాక్ హోల్ కు బలి అవ్వాల్సిందేనట.

    ‘బ్లాక్ హోల్స్’ అని పేరు పెట్టబడినప్పటికీ, అవి రంధ్రాలు కావు, చాలా చిన్న ప్రాంతాలలో రద్దీగా ఉండే పదార్థం భారీ సేకరణలు. వాటి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ హోల్స్ రెండు భాగాలను కలిగి ఉంటాయి. అందులో ఒక‌టి ఈవెంట్ హోరిజోన్. ఇది బ్లాక్ హోల్ ఉపరితలంగా భావించవచ్చు, అయితే ఇది కేవలం ఇత‌ర వాటి నుంచి తప్పించుకోవడానికి గురుత్వాకర్షణ చాలా బలంగా ఉండే పాయింట్. ఇక మ‌ధ్య‌లో ఉండేది ఒక ర‌క‌మైన రంధ్రం. అదే బ్లాక్ హోల్. ఇక్క‌డి నుంచి కాంతి కూడా ప్ర‌యాణించ‌లేదు. అంటే కాంతిని కూడా అది మింగేస్తుంది.

    ఎందుకు ఇలా జ‌రుగుతుంద‌నేది పూర్తిగా అంతు చిక్క‌ని ర‌హ‌స్యంగానే మిగిలిపోయింది.ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం క‌నుగొనే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లు విష‌యాల‌ను వెలికి తీశారు. శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ ర‌కాల‌ను వర్గీకరించడంలో విజయవంతంగా పురోగతి సాధించారు.

    బ్లాక్ హోల్ ఎన్ని ర‌కాలు?

    స్టెల్లార్ బ్లాక్ హోల్ : ఈ బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి అంటే.. సూర్యుని ద్రవ్యరాశి కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఉన్న భారీ నక్షత్రాలు శ‌క్తిని ఎగ్జాస్ట్ చేసినప్పుడు స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఏర్ప‌డ‌తాయిని చెబుతున్నారు నిపుణుల. అయితే అప్పుడు నక్షత్రంలోని ప్రధాన భాగం సూపర్నోవాగా విస్ఫోటనం చెందుతుంది అంటున్నారు నిపుణులు.

    ఇంటర్మీడియట్-మాస్ బ్లాక్ హోల్స్: ఇంటర్మీడియట్-మాస్ బ్లాక్ హోల్స్ కొంచెం మిస్టరీగా మిగిలిపోయాయి అంటున్నారు నిపుణులు. అవి సూర్యుని కంటే వందల నుంచి వందల వేల రెట్లు మారుతూ ఉండే ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయని భావిస్తున్నారు. ఈ ర‌క‌మైన బ్లాక్ హోల్స్ ఏర్పాటు స్టెల్లార్ బ్లాక్ హోల్స్ లేదా భారీ నక్షత్రాల ప్రత్యక్ష పతనం నుంచి ఏర్పడతాయట.