CM Chandrababu: టార్గెట్ అమరావతి.. ప్రతిపాదనలతో చంద్రబాబు.. కేంద్రం సంచలన నిర్ణయం

ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ప్రత్యేక విమానంలో ఢిల్లీలో అడుగుపెట్టిన ఆయన ప్రధాని మోదీ తో సమావేశం అయ్యారు. ఈరోజు వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా అమరావతికి సంబంధించి కీలక ప్రాజెక్టులపై సానుకూల నిర్ణయాలువెలువడినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 8, 2024 4:52 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి.గత ఐదేళ్లుగా అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయింది. అడవిని తలపించింది. ఈ క్రమంలో అమరావతికి వ్యతిరేకంగా వైసిపి ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే అమరావతి అనే పేరు వినిపించేది కాదు. కానీ అనూహ్యంగా టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో ఊపిరి పీల్చుకుంది అమరావతి. అదే సమయంలో టిడిపి కేంద్రంలో కీలక భాగస్వామి కావడంతో.. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం విశేషం. అమరావతి రాజధాని నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించింది. అటు తొలివిడతగా వచ్చేనెల 3750 కోట్లు విడుదల కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోపు ఆ పదిహేను వేల కోట్ల రూపాయల సాయం అమరావతికి అందనుంది. ఆ తరువాత ఆర్థిక సంవత్సరం కూడా సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవైపు నేరుగా నగదు సాయంతో పాటు కీలక ప్రాజెక్టులను సైతం కేంద్రం మంజూరు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉండడంతో.. చాలామంది మంత్రులను కలుస్తున్నారు. ఈ క్రమంలో కీలక ప్రాజెక్టులకు మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కేంద్రమంత్రి నితిన్ గట్కరితో చంద్రబాబు సమావేశం అయ్యారు. అమరావతికనెక్టివిటీ కి సంబంధించి కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది.నిన్నఢిల్లీ వెళ్లారు చంద్రబాబు.సాయంత్రానికి ప్రధాని మోదీ తో సమావేశమయ్యారు. ఈరోజు వరుసుగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతూ వస్తున్నారు. అందులో భాగంగా నితిన్ గడ్కరీ తో సమావేశం అయ్యారు బాబు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.

* అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీ
ప్రధానంగా చంద్రబాబు నుంచి కేంద్రానికి ఒక వినతి వెళ్ళింది.అమరావతి రాజధానికి అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ,హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే,రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ గురించి ప్రధానంగా చంద్రబాబు ప్రస్తావించారు.దీంతో పాటు పలు జాతీయ రహదారుల గురించి చర్చించారు.కీలక ప్రతిపాదనలు కేంద్రమంత్రి ఎదుట పెట్టారు. నిధుల కేటాయింపు తో పాటు రాజధాని నిర్మాణంలో భాగంగా కనెక్టివిటీ ఏర్పాటు పైన చర్చించారు. దీనిపై నితిన్ గట్కరి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

* స్టీల్ ప్లాంట్ అంశంపై కీలక చర్చలు
కాగా సీఎం చంద్రబాబు మంత్రి కుమారస్వామి తో సమావేశం అయ్యారు.వీరి మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.సెయిల్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విలీన ప్రతిపాదనలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.ఇప్పటికే ఈ అంశంపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చించారు. మరోవైపు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి తో ఇదే అంశాన్ని చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అమరావతిని టార్గెట్ చేసుకొని చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్ అయినట్లు సమాచారం.