Gold vs Mobile: ఈరోజుల్లో డబ్బు సంపాదించడమే అసలు లక్ష్యం. అయితే సాధారణ జీవితం గడపడానికి ఏ పనైనా చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ నేటి యూత్ మాత్రం మంచి లైఫ్ కోరుకుంటుంది. అందుకోసం ఉద్యోగం మంచిదా? వ్యాపారం బెటరా? అన్న సందేహం చాలా మందికి ఉంది. అయితే కొంతమంది నిపుణులు తెలుపుతున్న ప్రకారం కాస్త రిస్కు అయినా.. ఉద్యోగం చేస్తున్నా.. అదనపు ఆదాయం కోసం కొన్ని రకాల పెట్టుబడులు పెట్టవచ్చని అంటున్నారు. ప్రస్తుత సమయంలో బంగారం పై పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంతో లాభం అని చాలామంది అనుకుంటున్నారు. దీంతో మధ్యతరగతి ప్రజలు సైతం బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే బంగారం కంటే విలువైనది మరొకటి ఉన్నది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. అదేంటంటే?
ఉదాహరణకు ప్రస్తుతం 10 గ్రాముల బంగారానికి 1,25,000 వెచ్చించి కొనుగోలు చేస్తారు. ఇది భవిష్యత్తులో రెండు లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు దాదాపు రూ.60 నుంచి 70 వేల వరకు లాభం వస్తుంది. కానీ ఆ తర్వాత బంగారం ఎటువంటి ఉపాధిని ఇవ్వదు. పైగా 1,25,000కు వడ్డీని చెల్లించాల్సి వస్తే కొనుగోలు చేసిన బంగారంలో సగం వరకు వడ్డీకే వెళుతుంది. దీంతో రూ.60 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయలు వడ్డీకి తీసేస్తే 30,000 మాత్రమే లాభం అని అనుకోవాలి. ఈ వచ్చిన లాభాన్ని కుటుంబ అవసరాలు తీర్చుకుంటే.. ఆ డబ్బు కూడా మాయమైపోతుంది.
మరి ఇక్కడ అదే రూ.1,25,000 పెట్టుబడి పెట్టి.. ఒక మొబైల్, ఒక మైక్, వీడియో ఎడిటింగ్ కోసం కొంత అమౌంట్.. ఇన్వెస్ట్మెంట్ చేశామని అనుకోవాలి. ఇలా కొన్ని కంటెంట్లు క్రియేట్ చేయడం వల్ల కొన్ని రోజుల వరకు ఆదాయం వస్తుంది. అలాగే ఆ తర్వాత కూడా ఎప్పటికీ వీటి ద్వారా ఆదాయం పొందుతూనే ఉంటాం. అంతేకాకుండా రూ.1,25,000 అప్పు తెస్తే అది కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనం ఏదైనా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే.. దానిద్వారా రాబడి ఎంత వస్తుందో ఆలోచించాలి. అంతేకాకుండా అది నిరంతరమైన రాబడి ఇస్తుందా? లేదా ఒక స్థాయి వారికి వెళ్లి ఆగుతుందా? అనేది చూసుకోవాలి. అలా కొన్ని విషయాలను సరిపోవడం వల్ల మీరు కరెక్ట్ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కేవలం మొబైల్ పైనే చేయమనడం లేదు. ఆ డబ్బుతో ఆదాయం వచ్చే వాటిపై చేయాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బంగారం కొనుగోలు చేయవద్దని ఎవరు అనడం లేదు. అయితే అవసరమైన మేరకు మాత్రమే బంగారం కొనుగోలు చేసి.. మిగతా డబ్బును ఆదాయం వచ్చే వాటిపై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లాభాలు ఎక్కువగా పొందుతారు.