Women: ఆడదంటే ఆటబొమ్మగా భావిస్తారు. అంగడి సరుకుగా చూస్తారు. వెంట పడి వేధిస్తారు నిత్యం ఏవో సూటిపోటి మాటలతో నిత్యం బాధలకు గురిచేస్తారు. కానీ మహిళలను వేధిస్తే కేసులు ఉంటాయనే సంగతి వారికే తెలియదు. వారి వెంటపడి వేధించే వారికి కటకటాలే దిక్కని తెలుసుకోలెకపోవడం నిజంగానే దురదృష్టమే. కానీ చాలా మందికి వారి కోసం చట్టాలున్నాయని అవగాహన కలగకపోవడంతోనే భయం గుప్పిట్లోనే బతుకుతున్నారు. వెంట పడి వేధించే వారికి భారీ శిక్షలు, జరిమానాలు ఉన్నాయని తెలుసుకోలేక సతమతమవుతున్నారు.

చట్టాలను సరిగా తెలుసుకుంటే వారికి తిరుగుండదు. నేటి కాలంలో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు లాంటి పలు చోట్ల మహిళలకు అనేక భంగపాట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ వారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ ప్రదేశాలలో కానీ మరెక్కడైనా మహిళలపై వేధింపులకు పాల్పడితే సెక్షన్ 294 ప్రకారం మూడు నెలల జైలు లేక జరిమానా విధిస్తారు. ఒక్కోసారి అది మూడు నెలల జైలు తోపాటు శిక్ష కూడా ఉంటాయి.

మహిళకు ఇష్టం లేకపోయినా అత్యాచార యత్నం చేస్తే సెక్షన్ 354(ఎ) ప్రకారం వారికి మూడేళ్ల జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అవి రెండు అంటే మూడేళ్ల జైలు, జరిమానా విధించొచ్చు. దీంతో మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉండటంతో వీటి గురించి మహిళలు తెలుసుకుని వారి రక్షణకు వారే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: హోదా రగిలింది..వైసీపీ ఏం చేస్తుంది?
మహిళలపై వేధింపులకు పాల్పడితే 354(డి) ప్రకారం అలా ప్రవర్తించిన వారికి మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. మహిళలకు ఇష్టం లేకపోయినా వారిని బలవంతంగా అనుభవిస్తే వారికి సెక్షన్ 503 ప్రకారం రెండేళ్ల జైలు, జరిమానా విధించొచ్చు. కొన్ని సార్లు రెండు అమలు చేసే అవకాశం ఏర్పడుతుంది.
ఆడవాళ్లకు తెలియకుండా వారి ఫొటోలు తీస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడితే వారికి సెక్షన్ 354(సి) ప్రకారం వారికి ఒకటి నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే వీలుంది. సెక్షన్ 499 ప్రకారం ఫొటోలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తే కనీసం రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇది ఇంకా ఎక్కువ కావచ్చు. మహిళలకు తెలియకుండా వారికి ఎన్నో చట్టాలు అండగా ఉన్నా వాటిని ఎవరు తెలుసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: మోడీపై ఈసారి కేసీఆర్ టార్గెట్ ఇదే!