https://oktelugu.com/

Lifestyle : సూర్యాస్తమ సమయంలో కలయిక? మంచిదా? చెడు జరుగుతుందా?

హిందూ మత గ్రంథం ప్రకారం ఈ సమయంలో ఆహారం కూడా తీసుకోకూడదట. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యాల పాలవుతారని అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2024 / 06:45 PM IST

    Is husband and wife romance good at sunset?

    Follow us on

    Lifestyle : లోకాలకు వెలుగునిచ్చే సూర్యడిని ఆదిత్య దేవుడిగా కొలుస్తాం. ప్రతిరోజూ ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయడం ఎంతో మంచిది. ఉదయం సమంలో సూర్యుడి ఎండలో ఉండడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయి. అయితే సూర్యోదయానికి ముందే అన్ని పనులు చేయాలని కొందరు పండితుల చెబుతారు. కానీ సూర్యాస్తమ సమయంలో వీటిని అస్సలు చేయకూడదని కొందరు అంటున్నారు. ముఖ్యంగా సూర్యస్తమ సమయంలో దంపతులు కలయిక వలన పెద్ద ప్రమాదమే ఉండనుందట. అదేంటంటే?

    ప్రతి ఒక్కరూ తమ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఇల్లును శోకంలోకి నెట్టుతారు. రోజూవారీ చేసే పనులే క్రమ పద్ధతిన చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. అలా కాకుండా సమయ పాలన లేకుండా కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో అనేక సమస్యలలు ఎదురవుతాయి. ముఖ్యంగా భార్యభర్తల కలయిక అనేది చీకటి తరువాతనే ఉంటుంది. అలా కాకుండా కొందరు వేళాపాళా లేకుండా సూర్యాస్తమ సమయంలో కలవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల వచ్చే జన్మలో వారు జంతువుగా పుడతారట. అంతేకాకుండా వారికి జన్మించే బిడ్డ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడట.

    సూర్యస్తమ సమయంలో ఇదే కాకుండా మరికొన్ని పనులు కూడా చేయొద్దు. గోళ్లు కత్తరించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. గోళ్లు కత్తరించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. జుట్టును కూడా ఈ సమయంలో కత్తించకుండా ఉండాలి. సూర్యస్తమ సమయంలో వేద శాస్త్రాలు చదవకూడదట. ఈ సమయంలో ఆరోగ్యకరమైన వ్యక్తి నిద్రపోకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా నిద్రపోవడం వల్ ఇంట్లో డబ్బు నిలవదు.

    సూర్యస్తమ సమయంలో మేరేం చేయవచ్చు? అనే సందేహం ఉంటుంది. ఈ సమయంలో ధ్యానం పాటించవచ్చు. వీలైతే ప్రత్యేక పూజలు చేయొచ్చు అని చెబుతున్నారు. హిందూ మత గ్రంథం ప్రకారం ఈ సమయంలో ఆహారం కూడా తీసుకోకూడదట. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యాల పాలవుతారని అంటున్నారు.