Relationship : అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఆహారం మనిషికి ఆకలిని తీర్చడమే కాకుండా ఆనందాన్ని ఇస్తుంది. అన్నం తిన్న సమయంలో ఒక మనిషి ఎంతో సంతృప్తి చెందుతాడు. అలాంటి భోజనం చేసేటప్పుడు కొన్ని పద్దతులు పాటించాలి. అన్నం తినే సమయంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. శుచి, శుభ్రత లేని ప్రదేశంలో భోజనం చేయకూడదు. మొబైల్, టీవీ చూస్తూ కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేయడం వల్ల ఇంట్లో ఉల్లాసమైన వాతావరణం ఏర్పడుతుంది. గరుడ పురాణం ప్రకారం కొంత మందితో కలిసి భోజనం చేయడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. వారితో భోజనం చేయడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరగుతుంది. ఎలాగంటే?
చుట్టూ ఉన్నవాళ్లు అనుకూలంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంటి. అలాంటి వారు కాకుండా వ్యతిరేకమైన మనుషులు ఉన్నచోట వారితో కలిసి భోజనం చేయడం ప్రమాదకరం. వారి పక్కన కూర్చొని భోజనం చేయడం ద్వారా మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఇలా ప్రతికూల ఆలోచలనతో భోజనం చేయడం వల్ల సరైన ఆహారం తినలేరు. ఒక వేళ బలవంతంగా తిన్నా అది సరైన భోజనం అనిపించుకోదు.
చాలా మంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ సమయంలో అబద్ధాలు కూడా చెబుతూ ఉంటారు. ఇలా అబద్దాలు చెప్పే వ్యక్తులను పక్కన ఉంచుకొని భోజనం చేయడం మంచిది కాదు. వారు ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ తినే వారిని పక్కదోవ పట్టిస్తారు. వారి వల్ల మనసు గందరగోళం ఏర్పడి సరిగ్గా భోజనం చేయరు.
భోజనం చేసేటప్పుడు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పక్కన ఉండడం వల్ల భోజనం చేయకుండా ఉండాలి. అయితే తప్పని సరి అయితే మినహాయింపు ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో భోజనం చేయడం వల్ల అతని వద్ద ఉన్న క్రిములు భోజనం లో వచ్చి చేరుతాయి. దీంతో కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
కొందరికి దైవం అంటే ఇష్టముండదు. అలాగని వారు అక్కడితో ఆగకుండా వ్యతిరేకమైన కొన్ని వాదనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మనసు పాడవుతుంది. పైగా అన్నంను లక్ష్మీతో భావిస్తారు. ఇలా ఆహరం తినేటప్పుడు వారితో కలిసి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా.. వారి వల్ల ప్రభావితం అయినా సరైన భోజనం అనిపించుకోదు.