
IPL On Jio Cinema: జియో సినిమా సంచలనం సృష్టించింది. డిజిట్ ఫ్లాట్ ఫాంపై ప్రారంభమైన ఈ యాప్ కు మొదట్లో అంతగా ప్రాధాన్యం రాలేదు. కానీ గడిచిన మూడు రోజుల్లో ప్రభంజనం సృష్టించింది. ఈ కాలంలో యాప్ కు ఏకంగా 147 కోట్ల వ్యూస్ వచ్చాయి. కొత్త వీక్షకుల సంఖ్య 10 కోట్లకు చేరింది. డిజిటల్ చరిత్రలో ఒక యాప్ కు ఇంత వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. జియో చరిత్ర సృష్టిస్తుందనడానికి ఇదే నిదర్శనం అని సీఈవో అనిల్ జయరాజ్ తెలిపారు. అయితే ఇదంతా ఐపీఎల్ మ్యాచ్ లతోనే సాధ్యమైంది. హాట్ స్టార్ ద్వారా టీవీలో ప్రసారమవుతున్నా.. జియో సినిమా ద్వారా దీనిని ఉచితంగా ప్రసారం చేస్తుంది. దీంతో టీవీ కంటే ఈ యాప్ ద్వారానే ఎక్కువ మంది వీక్షించారు.
భారత్ లో క్రీడాభిమానం ఎక్కువే. ఒకప్పుడు మ్యాచ్ ఉందంటే దగ్గర్లోని టీవీల్లో చూసేవారు. కానీ మొబైల్ చేతికొచ్చాక మొన్నటి వరకు ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకున్నారు. ఆ తరువాత హాట్ స్టార్ యాప్ ద్వారా మొబైల్ లో లైవ్ చూసేందుకు అవకాశం ఇచ్చినా చార్జ్ వసూలు చేసింది. కానీ జియో సినిమా మాత్రం ఉచితంగా వీక్షించేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో ఐపీఎల్ ప్రియులు అంతా జియో సినిమాను ఫాలో అవడం మొదలు పెట్టారు. ఎక్కడ ఉన్నా జియో సినిమా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మ్యాచ్ ను చూస్తున్నారు.

ఇలా దేశ వ్యాప్తంగా 60 శాతం మంది యాప్ ద్వారానే ఐపీఎల్ ను వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఐపీఎల్ మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సాగింది. ఈ మ్యాచ్ ను ఒక్కరోజే 1.6 కోట్ల మంది చూశారు. ఇదే రోజు 2.5 కోట్ల జియో సినిమా యాప్ లు డౌన్లోడ్ అయ్యాయి. 4కే ఫీడ్, 16 ప్రత్యేక ఫీడ్, హైప్ మోడ్, మల్టీ క్యామ్ సెటప్ లను కలిగి మొత్తం 12 భాషల్లో ఐపీఎల్ మ్యాచులన్నింటినీ జియో సినిమా లైవ్ కవరేజ్ చేస్తోంది. ఒక్కో మ్యాచ్ సగటున 57 నిమిషాల నిడివితో అప్లోడ్ చేస్తోంది.
ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉచితంగా మ్యాచ్ ప్రసారం కావడంతో టీవీల్లో కంటే మొబైల్లో చూడడంపై యువత ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్స్ జియో సినిమా యాప్ ను ఎక్కువగా డౌన్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. జియో ఐపీఎల్ ను డిజిటల్ రైట్స్ ను 23 వేల 800 కోట్లకు కొనుగులో చేసింది. అయితే ఇప్పుడీ యాప్ కు వ్యూస్ రావడంతో పాటు యాడ్స్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. టెలికాం రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన జియో ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫాం పై రికార్డు సృష్టించడం విశేషం. ఇప్పటి వరకు మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ ఏ యాప్ కు రాలేదు. ఇప్పుడు జియోకు రావడం తీవ్రంగా చర్చ సాగుతోంది. అంతేకాకుండా దేశంలో డిజిటల్ విప్లవం ఏ మేరకు పెరిగిందో ఈ రికార్డులే నిదర్శనమని అనుకుంటున్నారు.