Homeప్రత్యేకంBenefits Of Yoga: యోగా.. ఒంటికి మంచిదేగా..!

Benefits Of Yoga: యోగా.. ఒంటికి మంచిదేగా..!

Benefits Of Yoga: ఒళ్ళు విల్లులా వంగాలా? చిచ్చు కొచ్చే పొట్ట వచ్చిన దారి వెంటే వెనక్కు వెళ్లాలా? ఊపిరి సలపని ఒత్తిడి మటుమాయం కావాలా? వేధించే మధు మేహానికి, ఏడిపించే మిగతా వ్యాధులు అదుపులో ఉండటానికి ఒకేఒక్క దివ్యౌషధం యోగా.. ఈ యోగా ఈ నాటిది కాదు. పురాతన కాలం నాటి నుంచి ఉన్నదే. నేడు అంత్జాతీయ యోగా దినోత్సవం. ఆమెరికా వాషింగ్టన్ డీసీ నుంచి కాశ్మీర్ లోని సియాచిన్ దాకా ప్రపంచమంతా నేడు యోగ ముద్రలో ఉంటుంది.

Benefits Of Yoga
Benefits Of Yoga

ప్రపంచానికి అందించిన అద్భుతం

ఈ ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయి.
యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుంచి పుట్టింది. యజ అంటే దేనినైనా ఏకం చేయగలగడం అని అర్థం. ఆసనం అన్న పదానికి సంస్కృతంలో భంగిమ అని అర్థం ఉంది. ఈ రెండింటిని కలిపి యోగాసనాలు అని పిలుస్తారు. మనస్సును,శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మిక తాదాత్మ్యం అందించేదే యోగా అని చెబుతారు. భారతదేశంలో వేద కాలం నుంచే యోగ ఉందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. చరకుడు, శుశ్రుతుడు తమ వైద్య గ్రంథాల్లో యోగా పేరు చేర్చారు. ఇక పరమ శివుడు మొదట తన పత్ని పార్వతికి యోగా గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

Also Read: Modi Comments on Agneepath scheme: అభివృద్ధి.. అన్యాయం.. అగ్నిపథ్ పై మోడీ సంచలన వ్యాఖ్యలు

2014 లో బీజం

2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరపాలని ప్రతిపాదన చేయడం, ఈ తీర్మానానికి 193 ఐరాస(ఐక్య రాజ్య సమితి) ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇవ్వడం తెలిసిందే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు సహ ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించారు.

Benefits Of Yoga
Benefits Of Yoga

దీంతో 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే.. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు ఇవాళ. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి భారత ప్రధాని మోదీ సూచించారు.
జూన్ 21,2015న భారత్‌లో ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో యోగా వేడుకలను నిర్వహించగా… 84 దేశాల నుంచి వచ్చిన నేతలు అందులో పాల్గొన్నారు.మొత్తం 35,985 మంది యోగా చేసి గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పారు. అప్పటినుంచి ప్రతీ ఏటా భారత్‌లో ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆనవాయితీగా అందులో పాల్గొంటున్నారు.

ఈసారి థీమ్ ఇదే :

‘క్షేమం కోసం యోగా’ అనే థీమ్‌తో ఈసారి దేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపనున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఈ థీమ్ ఇచ్చారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 6.30గంటలకు ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Benefits Of Yoga
Benefits Of Yoga

అవగాహన తక్కువ

‘బం చిక్ చిక్ భం చెయ్యి బాగా చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా’ అని రమ్యకృష్ణ స్టెప్పులేసి మరీ చెబితే ఆ పాటను చూసిన వాళ్లున్నారు గానీ పాటించిన వాళ్లు తక్కువే. భారత్‌లో ఇప్పటికీ యోగాపై ప్రజల్లో అవగాహన అంతంత మాత్రంగానే ఉందనేది కాదనలేని సత్యం. అయితే కొన్నేళ్లుగా ఆరోగ్యానికి యోగా చేసే మేలు గురించి, మానసికంగా, శారీరకంగా యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి స్వయంగా దేశ ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుండటం శుభ పరిణామం. దేశ ప్రజలకు యోగా విశిష్టతను తెలియజెప్పేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) రోజు మరోమారు జరిపుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా నాలుగో వేవ్ ప్రభావం అక్కడక్కడ ఉన్న నేపథ్యంలో సామూహికంగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ యోగా డేను జరుపుకోవాలని సూచిస్తున్నారు.

ఐరాస ఏం చెప్పిందంటే

ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించడానికి.. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండటానికి యోగా ఎంతగా ఉపకరిస్తుందో తెలియజెప్పేందుకు ప్రతీ సంవత్సరం జూన్ 21న ‘ ఇంటర్నేషనల్ యోగా డే’ ను జరపాలని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది.
2022లో జరుపుకోబోతున్న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ భారతీయులకు ఎంతో ముఖ్యమైన రోజు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది భారతీయులు పలు శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరోనా సోకిన వారితో పాటు దేశంలో ఈ పరిస్థితులను గమనించి ఆందోళన చెందుతున్న వారు కూడా మానసికంగా కుంగిపోతున్నారు. ఈ ఆందోళనే మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. ఇక.. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల కూడా చాలామందిలో మానసికంగా మార్పులు వచ్చాయనడంలో సందేహం లేదు. అప్పటి దాకా స్వేచ్ఛగా విహరిస్తున్న ఓ పక్షిని పంజరంలో బంధించినట్టుగా పరిస్థితి ఉండటం, గతంలో గడిపిన జీవనానికి భిన్నంగా జీవించాల్సి రావడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవడం సహజం. అయితే.. ఆ మానసిక ఒత్తిడి ప్రభావం మరింత పెరిగితే ఆరోగ్యానికి ముప్పు తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మానసిక రుగ్మతల నుంచి బయటపడేసి, ప్రశాంత జీవనాన్ని కొనసాగించడానికి ఉపకరించే ఒకేఒక్క మార్గం యోగా. ధ్యానాన్ని ఆచరించడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను జయించి ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది.

Benefits Of Yoga
Benefits Of Yoga

కరోనా వంటి ఉపద్రవాలు ఆందోళన కలిగించినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలో యోగా ఒక దారి చూపిస్తుంది. ఐక్యరాజ్య సమితి అధికారిక వెబ్‌సైట్‌లో కూడా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎలా ఉపకరిస్తుందో పొందుపరిచింది. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న కొవిడ్-19 బాధితులు కూడా మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని.. ఈ భయాలను, ఆందోళనలను పోగొట్టేందుకు యోగా ఉపయోగపడుతుందని ఐక్యరాజ్య సమితి తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా యోగా వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొంది. యోగా వల్ల ఫిట్‌నెస్, మానసిక ప్రశాంతత దక్కుతాయని తెలిపింది.అంతర్జాతీయ యోగా దినోత్సవం- మూలాలు:ఆరోగ్యానికి మేలు చేసే యోగా విశిష్టతను, అవసరాన్ని తెలియజెప్పేందుకు.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘అంతర్జాతీయ యోగా దినోతవ్సం’ జరుపుకోవడాన్ని తప్పనిసరి చేయాలని ఐక్యరాజ్య సమితికి తొలుత ప్రతిపాదించింది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే కావడం విశేషం. 2014లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ‘ప్రాచీన భారతం ప్రసాదించిన వెలకట్టలేని బహుమతి యోగా’ అని, ‘ప్రకృతికి, ‘మనిషికి మధ్య సామరస్యాన్ని పెంపొందించేదే యోగా’ అని యోగా విశిష్టతను మోదీ ప్రపంచానికి తెలియజేశారు. భారత ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ అంతర్జాతీయ యోగా దినోత్సవం’ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతు తెలిపాయి. ఈ స్థాయిలో ఒక ప్రతిపాదనకు ఇన్ని దేశాలు మద్దతు తెలపడం ఐక్యరాజ్యసమితి చరిత్రలోనే అరుదు.

Also Read:AP CM YS Jagan: పనిచేస్తారా? చస్తారా? జగన్ మారిపోయాడుగా?
Recommended Videos

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular