Heavy Rains in Telangana: రాష్ర్టంలో వర్షాలు కురుస్తున్నాయి. జోరుగా వానలు పడుతున్నాయి. ఇన్నాళ్లు ఎండలో ఉడికించిన ప్రకృతి ఒక్కసారిగా చల్లబడింది. భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు తమ పంటలు వేసుకునేందుకు క్షేత్రాలను సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. వానల జోరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సోమవారం కురిసిన భారీ వర్షంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి.

ఒక్క వానకే రహదారులన్ని ఇలా అయితే వానకాలం అంతా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలియడంతో పరిస్థితి ఏమవుతుందో అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి భాగ్యనగరం మాత్రం సురక్షితంగా లేదని తెలుస్తోంది. భారీ వర్షాలతో వరదలు ముంచెత్తితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుందో తెలిసిందే. ప్రస్తుతం కూడా అలాంటి ఉపద్రవమే ముంచుకొస్తుందనే భయం అందరిలో నెలకొంది.
Also Read: Benefits Of Yoga: యోగా.. ఒంటికి మంచిదేగా..
నగరంలో ఉన్న చెరువులను మొత్తం కబ్జా చేసి నాలాలు పారకుండా చేయడంతో ఇప్పుడు వర్షం పడిందంటే చాలు సిటీ మొత్తం వరదలు ముంచెత్తుతాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం పది సెంటిమీటర్ల వర్షం కురవడంతో రోడ్లన్ని నదులను తలపించాయి. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు. రోడ్ల మీద నీరు ప్రవహించడంతో ఎక్కడ ఏముందో తెలియదని హెచ్చిరిస్తున్నారు.

అందుకే బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు నగర మేయర్ విజయలక్ష్మి, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాల సూచనతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. దీంతో నగరంలో వర్షాలతో ఎంతటి నష్టం జరుగుతుందో అని కంగారు పడుతున్నారు. పాలకులు సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి కష్టాలు ప్రజలకు వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. ఏదైనా ప్రమాదమని గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.
Also Read:AP CM YS Jagan: పనిచేస్తారా? చస్తారా? జగన్ మారిపోయాడుగా?