Interesting Facts: జీవిత చక్రంలో పడి బయటపడేవారు కొంతమంది ఉంటారు. ఎందుకంటే జీవితం పూల పాన్పు కాదు అనేది కొందరి భావన. వాస్తవానికి ఎవరి జీవితమైనా కష్టసుఖాలను కలిగి ఉంటుంది. కానీ కొందరికి తక్కువ.. కొందరికి ఎక్కువ మాత్రమే ఉండొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తోడు నీడ కచ్చితంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే నలుగురు మనుషులతో స్నేహం చేస్తూ.. పదిమందితో కలిసి ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే నేటి కాలంలో ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు. వారిలో ఈ పదిమందిలో ఒకరు కూడా ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ పదిమందిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిద్దాం..
Also Read: జగన్ కు ముందే జిల్లాల పర్యటన.. షర్మిల స్కెచ్ అదే!
నలుగురితో కలిసిమెలిసి ఉండడం మంచి పరిణామమే. కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కొందరు వంచన చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వారి అభివృద్ధిని అడ్డుకునే అవకాశం ఉంది. అందువల్ల ఆ అవకాశం వారికి ఇవ్వకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆ విషయాలను ఇతరులతో పంచుకోకుండా రహస్యంగా ఉంచుకోవాలి. అప్పుడే వ్యక్తిగతంగా విజయం సాధించగలుగుతారు. మరి ఆ విషయాలు ఏంటంటే?
ఆర్థికపరమైన విషయాలను దాదాపుగా ఇతరులతో పంచుకోకుండా ఉండడమే మంచిది. తమకు ఎంత ఆస్తి ఉంది? ఎంత సంపాదిస్తున్నారు? ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది? అనే విషయాలను ఇతరులకు చెప్పద్దు. ఎందుకంటే ఈ విషయాల ద్వారా ఎదుటివారు కుట్రలు పని అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు ఎంత ఉంది అనే విషయం ఇతరులకు చెప్పకపోవడమే మంచిదని అంటున్నారు.
కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను బయట వారికి చెప్పకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ప్రతి కుటుంబం ఆ వ్యక్తులకు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ కుటుంబంలోని సమస్యలు, సంతోషాలు ఎదుటివారికి నచ్చకపోవచ్చు. ఇలాంటి సమయంలో కుటుంబం గురించి ఎదుటివారికి చెప్పడం వల్ల వారు హేళన చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరి వీక్నెస్తో ఆడుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల కుటుంబానికి సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచుకోవాలి.
భవిష్యత్తులో ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నాము? ఎలాంటి ఆర్థిక ప్రణాళికలు వేస్తున్నాము? అనే విషయాలు కూడా ఇతరులకు చెప్పొద్దు. ఈ విషయాలు ఎదుటివారికి చెప్పడం వల్ల వారు ఆ పనులకు ఆటంకం సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ పనులకు ఆటంకం సృష్టించడం వల్ల అభివృద్ధి సాధించలేరు. అంతేకాకుండా ఉద్యోగం, వ్యాపార సముదాయాల్లో ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల వారి అభివృద్ధిని అడ్డుకునే ఛాన్స్ ఉంది. అందువల్ల భవిష్యత్తుకు సంబంధించిన ఎటువంటి విషయాలైనా ఇతరులతో పంచుకోకుండా ఉండడమే మంచిది.
ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా ఇతరులకు పంచుకోవద్దు. ఈ విషయాలతో వారు హేళన చేయడమే కాకుండా.. ఉచిత సలహాలు ఎన్నో ఇస్తూ ఉంటారు. ఈ సలహాలు పాటించడం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో వీరిచ్చే సలహాలతోనే కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
Also Read: టయోటా సంచలనం.. డీజిల్ లేకుండానే దూసుకుపోతుంది