Covid – 19 Facts: ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ని మహమ్మారిగా గుర్తించి శుక్రవారం నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి సాధారణ స్థితికి చేరుకుంది.

బ్రిటీష్ మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో కోవిడ్ కారణంగా సంభవించిన మరణాలపై జరిపిన కొత్త అధ్యయనాన్ని ప్రచురించింది. ఇన్‌ఫెక్షన్ వల్ల మరణాల సంఖ్య మరియు అంచనా వేయబడిన వాస్తవ మరణాల సంఖ్య మధ్య చాలా అంతరం ఉన్నట్లు తెలిపింది.
పీర్-రివ్యూ గ్లోబల్ అంచనాల ప్రకారం జనవరి 1, 2020 నుండి డిసెంబర్ 31, 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా 18.2 మిలియన్ల మంది మరణించి ఉండవచ్చని తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 5.9 మిలియన్ల అధికారిక రికార్డు కంటే మూడు రెట్లు ఎక్కువ.
విశేషమేమిటంటే, కోవిడ్-19 కారణంగా అత్యధికంగా మరణించిన వారిలో భారతదేశం అత్యధిక సంఖ్యలో ఉంది, అత్యధిక జనాభా కారణంగా ఈ మరణాలు సంబవించినట్టు.. మొత్తం ప్రపంచ మరణాల సంఖ్యలో అది 22% ఉన్నట్లు అంచనా వేయబడింది.
అధ్యయన కాలంలో భారతదేశంలో కోవిడ్ మరణాలు 4,89,000గా ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వాప్తవికంగా కనిపించడం లేదు. మరణాల సంఖ్య ఎనిమిది రెట్లు అధికంగా అంటే 4.07 మిలియన్లుగా ఉందని అధ్యయనం అంచనా వేసింది.
అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో ఆమెరికా (1.13 మిలియన్లు), రష్యా (1.07 మిలియన్లు) ఉన్నాయి.
Also Read: China Imposes Lockdown: ప్రపంచం అంతా తెరుచుకుంటుంటే చైనా మూసేస్తుంది!
భారతదేశంలో నివేదించబడిన కోవిడ్ మరణాల రేటు 1,00,000కి 18.3 మరణాలు అయితే అధ్యయనంలో మాత్రం 1,00,000 మందికి 152.5 అదనపు మరణాలు నమోదైనట్లు తేలింది.
కొందరిలో సహజ కోవిడ్ రోగనిరోధక శక్తి ఎలా
చాలా మందికి ఈ వ్యాధి సోకిన కొందరిలో మాత్రం కోవిడ్ పాజీటివ్ నమోదు కాలేదు. వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉన్న ఓమిక్రాన్ కూడా భారత్ అంతలా ప్రభావం చూపలేదు. వ్యాధి సోకిన కుటుంబ సభ్యుల నుండి మిగితా వారికి వైరస్ వ్యాప్తి చెందలేదు. దానికి కారణం అందరికి తెలిసిందే.
వ్యాక్సినేషన్ స్థితి, వయస్సు, జెండర్ లేదా కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించడంలో శ్రద్ద వహించడం వల్ల మాత్రమే కోవిడ్ వ్యాప్తిని తగ్గలేదు. కోవిడ్ నిరోదించడంలో కీలకమైన ఆధారాలు మన జన్యువుల్లోనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సావో పాలో విశ్వవిద్యాలయం జన్యు శాస్త్రవేత్త డాక్టర్ మయానా జాట్జ్ మరియు వారి బృందం 100 మంది జంటలపై రక్త నమూనాలపై అధ్యయనం చేశారు – భాగస్వాములు కలిసి ఉండడం ద్వారా వైరస్ సంక్రమణం చెందదని తెలిపింది. సహజంగా వైరస్ నిరోధన జరుగుతున్నట్లు కనుగొన్నారు.
మానవ శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ కారణంగా కోవిడ్‌ను శరీరం కోవిడ్‌ను ఎదుర్కొనట్లు తెలిపారు. ఈ అంశాన్ని లోతుగా పరిశోధించడానికి, డాక్టర్ జాట్జ్ ల్యాబ్ సీనియర్ సిటిజన్‌లపై జన్యు మార్కర్లపై తన పరిశోధనను కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు.
ఆమె బృందం 90 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 100 మంది వ్యక్తుల నుండి రక్త నమూనాలను సేకరించింది మరియు కిల్లర్ కణాల చర్యను తెలుసుకోవడానికి వారి కణాలతో ల్యాబ్‌లోని పరీక్షించనున్నట్లు తెలిపారు.
“రెసిస్టెంట్ జన్యువులు ఏమిటో మరియు అవి ఏమి చేస్తాయో కనుగొనగలిగితే, మనం కొత్త చికిత్సలను కనుగొనగలమని నేను భావిస్తున్నాను” అని డాక్టర్ జాట్జ్ న్యూయార్క్ టైమ్స్‌తో తెలిపారు. హాస్యాస్పదంగా, జన్యువులు కూడా కోవిడ్ వ్యాప్తంగా కారణం కాగలదని తెలిపారు.
గత నవంబర్‌లో, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు కోవిడ్ నుండి శ్వాసకోశ వైఫల్య ప్రమాదాన్ని రెట్టింపు చేయడానికి కారణమైన జన్యువును గుర్తించారు. దక్షిణాసియా పూర్వీకులలో 60% మంది ఈ హై-రిస్క్ జెనెటిక్ సిగ్నల్‌ను కలిగి ఉన్నారని వారు పేర్కొన్నారు .
Also Read: Rashmi Gautam: క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తిన రష్మీ గౌతమ్