https://oktelugu.com/

Russia Ukraine War: ఉక్రెయిన్ లో చ‌నిపోతున్న సైనికుల‌ను కుక్క‌ల‌కు వ‌దిలేస్తున్నారా.. ఏంటీ దారుణం..!

Russia Ukraine War:  ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపిస్తున్న ఆందోళ‌న ఏదైనా ఉందా అంటే అది ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం. చాలా రోజులుగా ఇరు దేశాల న‌డుమ యుద్ధం కొన‌సాగుతోంది. ఎవ‌రికి వారు ఏ మాత్రం త‌గ్గ‌కుండా భీక‌ర పోరు చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు దేశాల మ‌ధ్య చాలా సార్లు శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ ఏవీ స‌క్సెస్ కాక‌పోవ‌డంతో యుద్ధం మాత్రం ఆగ‌ట్లేదు. బ‌ల‌మైన సైనిక బ‌ల‌గం ఉన్న ర‌ష్యా ప్ర‌త్య‌ర్థి ఉక్రెయిన్ పై మార‌ణ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 12, 2022 / 02:12 PM IST
    Follow us on

    Russia Ukraine War:  ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపిస్తున్న ఆందోళ‌న ఏదైనా ఉందా అంటే అది ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం. చాలా రోజులుగా ఇరు దేశాల న‌డుమ యుద్ధం కొన‌సాగుతోంది. ఎవ‌రికి వారు ఏ మాత్రం త‌గ్గ‌కుండా భీక‌ర పోరు చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు దేశాల మ‌ధ్య చాలా సార్లు శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ ఏవీ స‌క్సెస్ కాక‌పోవ‌డంతో యుద్ధం మాత్రం ఆగ‌ట్లేదు.

    Russia Ukraine War

    బ‌ల‌మైన సైనిక బ‌ల‌గం ఉన్న ర‌ష్యా ప్ర‌త్య‌ర్థి ఉక్రెయిన్ పై మార‌ణ హోమాన్ని కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే చాలా దాడులు చేస్తూ ఉక్రెయిన్ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెడుగుడు ఆడుతోంది. ఇక త‌క్కువ సైన్యం ఉన్న‌ప్ప‌టికీ ఉక్రెయిన్ కూడా భీక‌రంగా పోరాడుతోంది. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌ట్లేదు. అధ్య‌క్షుడు జెలెన్ స్కీ నేతృత్వంలో మాతృభూమి కోసం ప్రాణాల‌కు తెగించి పోరాడుతున్నారు.

    Also Read:  ఆ విష‌యంలో జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారా.. మ‌డ‌మ తిప్పేస్తున్నారా..?

    కాగా ఈ యుద్ధంలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా ర‌ష్య‌న్ సైనికుల మృత‌దేహాల‌ను అలాగే వ‌దిలేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీటిపై అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ర‌ష్య‌న్ సైనికుల మృత‌దేహాలు మంచులో కూరుకుపోతున్నాయి. అయితే వాటిని అలా ఎందుకు వ‌దిలేశారంటూ ఓ జ‌ర్న‌లిస్టు ఉక్రెయిన్ సైనికుల‌ను ప్ర‌శ్నించాడు.

    ukraine russia war

    దానికి వారు స‌మాధానం ఇస్తూ.. ఆ మృత‌దేహాల‌ను కుక్క‌లు తినేందుకు వ‌దిలేస్తున్నామ‌ని స‌మాధానం ఇచ్చారు ఉక్రెయిన్ సైనికులు. త‌మ మాతృభూమి కోసం తీవ్రంగా పోరాడుతున్నామ‌ని, త‌మ వారిని కాపాడుకుంటామంటూ చెబుతున్నారు. అయితే ఇలా శ‌వాల‌ను కుక్క‌ల కోసం వ‌దిలేయ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేపుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలామంది ఈ యుద్ధం కార‌ణంగా న‌ష్ట‌పోతున్నారు.

    Also Read: అమ్మఒడి.. నాన్న బుడ్డి, ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు వైరల్

    Tags